మహేష్ బాబు..పాటకే 2.5 కోట్లు ఖర్చు

మహేష్ బాబు..పాటకే 2.5 కోట్లు ఖర్చు

దూకుడు,బిజినెస్ మ్యాన్ చిత్రాలతో మహేష్ బాబు స్టామినా ఏంటో భాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు పూర్తిగా అర్దమైపోయింది. దాంతో అతనిపై కోట్లు కుమ్మరించటానికి రెడీగా ఉన్నారు. తాజాగా సుకుమార్,మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాట నిమిత్తం రెండున్నర కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫి అందిస్తున్నాడు. టాలీవుడ్ లో ఇదే హైయిస్ట్ ఖర్చు పెట్టి తీస్తున్న పాట అని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత గోపీచంద్ ఆచంట సైతం ఖరారు చేస్తున్నారు. 

గోపీచంద్ ఆచంట మాట్లాడుతూ...నేను ఎంత ఖర్చైంది అని చెప్పను కానీ..ఈ పాట మీద మాత్రం చాలా ఖర్చు పెడుతున్నాం. మొత్తం తెరమీద కనపడుతుంది. మేం తీసిన దూకుడు కన్నా లావిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు. ఇక ఈ పాట కోసం 500 మంది టాప్ మోడల్స్ ని ముంబై నుంచి రప్పించినట్లు తెలుస్తోంది. ఇది చిత్రంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్. అలాగే భారీ సెట్ సైతం వేసారు. మోడల్స్ కి ప్రత్యేకమైన డ్రస్ లు కుట్టించారు. చూసిన వాళ్లు కళ్లు తిప్పుకోలని విధంగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

ఇక ఫస్ట్ షెడ్యూల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పూర్తైంది. రెండో షెడ్యూల్ ఈ నెలాఖరున ప్రారంభించేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు. త్వరలోనే తేదీ ఖరారు కానుంది. ఈ గ్యాప్‌లో మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు రూపొందిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగులో పాల్గొంటునున్నారు.

మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దూకుడు చిత్ర నిర్మాతలైన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ అండ్ డైనమిక్‌గా, వయసు చాలా తక్కువ ఉన్న కుర్రాడిలా కనిపించబోతున్నాడు. ఇందు కోసం మహేష్ ప్రత్యేకంగా వర్కౌట్లు చేయడంతో పాటు స్పెషల్ డైట్ తీసుకుంటున్నాడు. 

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కాజల్ నటిస్తోంది. ఇందులో మహేష్ కాలేజీలో లెక్చరర్ గా కనిపిస్తారు. సుకుమార్ తన దైన శైలిలో కాలేజి సీన్స్ రాసుకున్నారని వినపడుతోంది. పూర్తి ఫన్ తో కాలేజీ లెక్చరర్ కీ,స్టూడెంట్స్ కీ మధ్య నడిచే కథతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు. సుకుమార్ గతంలో లెక్చరర్ గా చేసిన సంగతి తెలిసిందే.