రవితేజ అభిమానులకు షాక్!

రవితేజ అభిమానులకు షాక్!

మాస్ మహరాజ రవితేజ అభిమానులకు ఈ వార్త ఒకరకంగా షాక్ లాంటిదే. వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘దరువు' చిత్రం మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే 4వ తేదీనే విడుదల చేయాలని నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని మే 18వ తేదీకి వాయిదా వేశారు.

తాజాగా యూనిట్ సభ్యుల నుంచి వినిపిస్తున్న వార్త ప్రకారం పోస్టు ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని, మే 25వ తేదీన ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వాయిదా వెనక మరో రూమర్ కూడా వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ విడుదల నేపథ్యంలో కావాలనే ఈచిత్రాని మరోసారి వాయిదా వేసారి అంటున్నారు. అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

దరువు చిత్రం రవితేజ మార్కు ఎంటర్ టైన్మెంట్స్‌తో వినోదాత్మకంగా రూపొందుతోంది. గతంలో చిరంజీవి నటించిన ‘యముడికి మొగుడు' చిత్రం ఆధారంగా, ఒకరకంగా ఆ చిత్రానికి రీమేక్‌గా దరువు చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. అప్పుడు ఆ సినిమాలో యమ ధర్మరాజుగా కైకాల సత్యనారాయణ నటిస్తే..ఈ చిత్రంలో యంగ్ యమ ధర్మరాజుగా తమిళ నటుడు ప్రభు నటిస్తున్నాడు.

రవితేజ , తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్, సన, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్ గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతం రాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో గ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, కో -డైరెక్టర్స్: సత్యం బాబు, ఆది నారాయణ, అసోసియేట్స్: హరి, రాధా కృష్ణ, సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ