'అసభ్యంగా మాట్లాడినందుకే సూరి హత్య'

'అసభ్యంగా మాట్లాడినందుకే సూరి హత్య'

తన కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడినందుకే మద్దిలచెర్వు సూరిని హత్యచేసినట్లు భాను అంగీకరించాడు. సిఐడికి భాను ఇచ్చిన నేరాంగీకార పత్రంలో మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. వైజాగ్లో ఉన్నప్పుడు సూరితో అనుబంధం ఏర్పడిందని చెప్పారు. మంగళి కృష్ణ, మధుల సహాయంతో తనకు సూరితో పరిచయం ఏర్పడిందన్నాడు. 2006-07లో నాలుగు పిస్తోళ్లను సూరి చెప్పినట్లు మంగళి కృష్ణకు పంపి, మధుమోహన రెడ్డికి ఇప్పించినట్లు తెలిపాడు. అదే రోజు సుధాకర్ నాయుడు వద్ద నుంచి మరో రివాల్వర్ తీసుకున్నట్లు చెప్పాడు. 2009లో పద్మనాభరెడ్డి నుంచి ఓ రివాల్వర్ తీసుకున్నట్లు తెలిపాడు. కొండల రెడ్డి, రాజప్రకాశ్ రెడ్డితో కలసి కర్మాన్ ఘాట్లో భూమి సెటిల్మెంట్స్ చేసినట్లు వివరించాడు. సూరి హత్యకు ముందు ఓ రివాల్వర్ని అనిల్ దగ్గర నుంచి తీసుకున్నట్లు తెలిపాడు. టీవీ బాంబ్ పేలుడుకు ముందు పవన్ కుమార్, వాసుదేవరెడ్డితో కలిసి మద్యం వ్యాపారం చేశానన్నాడు. 2005-06లో హంద్రీనీవ ప్రాజెక్ట్ టెండర్లను నియంత్రించినట్లు చెప్పాడు. 178 కోట్లు ప్రాజెక్టును కెవిఎన్ రెడ్డికి దక్కేలా మిగతా కాంట్రాక్టర్లను బెదిరించినట్లు భాను సిఐడికి తెలిపాడు.