ఆర్థిక సమస్యల్లో నాగ్ ‘డమరుకం'?

ఆర్థిక సమస్యల్లో నాగ్ ‘డమరుకం'?

అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘  డమరుకం ' చిత్రం ఆర్ ఆర్ మూవీమేకర్స్ వారు ఈచిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రం ప్రోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ చిత్రం ఆర్థిక సమస్యల్లో ఉందని అంటున్నారు. 

నిర్మాతలు నాగార్జునకు ఇవ్వాల్సిన డబ్బు ఇంకా ఇవ్వలేదని, అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌కు సంబంధించిన పేమెంట్ కూడా చేయలేదట. ఈ నేపథ్యంలో సినిమా విడుదల కూడా మరింత లేటయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ పుకార్లలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

నాగార్జున,  అనుష్క  ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. గత ఆరు నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్న ఈ చిత్రం జూలై మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ...గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జున కీ, హీరోయిన్ కీ, శివుడు కీ మధ్య జరిగే కథనం ఆసక్తి గా ఉంటుంది అన్నారు.