81 ఏళ్ల రికార్డు బద్దలు '

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్' చిత్రం 81 ఏళ్ల తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగ రాసిందని ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. సినిమా విడుదలై వారం రోజులు పూర్తయి మంచి ఊపుమీద కలెక్షన్లు రాబడుతున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సంద్భంగా గణేష్ మాట్లాడుతూ...మామూలు మనిషిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాకు ఇండస్ట్రీ గర్వించదగ్గ పెద్ద హిట్ సినిమాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కి, సినిమా విజయంలో వెన్నుముఖగా నిలిచిన హరీష్ శంకర్‌కి ధన్యవాదాలు. 81 ఏళ్ల తెలుగు సినిమా రికార్డులను మా గబ్బర్ సింగ్ తిరగరాసింది. హద్దు అదుపు లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. వపన్ ఇచ్చిన మాట ప్రకారం నన్ను పరిశ్రమలో పెద్ద ప్రొడ్యూసర్‌గా నిలబెట్టాడు. 10 సంవత్సరాల తర్వాత పవన్ ప్రేక్షకుల దాహం తీరింది. దాసరి నారాయణలాంటి వారు నన్ను అభినందించడం జీవితంలో మరిచిపోలేను. త్వరలో
పవన్ కళ్యాణ్
అభిమానుల కోసం గ్రాండ్‌గా విజయోత్సవ వేడుక ఏర్పాటు చేస్తామన్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ....పవన్ నుంచి నేర్చుకున్న నిజాయితీ, నిబద్దత, కఠిన క్రమశిక్షణలే ఈ చిత్రం సక్సెస్‌కి కారణం అయ్యాయి. హిందీలో సూపర్ హిట్టయిన దబాంగ్‌ను తెలుగులో తీయాలనే ఆలోచన చేసింది, గబ్బర్ సింగ్ టైటిల్ పెట్టింది పవన్ కళ్యాణే. ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుంది. అదే విధంగా దేవిశ్రీ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్సయింది. గణేష్ లాంటి నిర్మాత లేక పోతే ఈరోజు గబ్బర్ సింగ్ చిత్రం లేదు. ఈ రోజు నుంచి ఆయన్ను గ్రాండియర్ గబ్బర్ గణేష్ అని పిలుస్తాను. అభిమానుల ఆనందమే నా ఆనందమని పవన్ నాకు పర్సనల్ గా చెప్పినప్పుడు ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అని తెలిపారు.
గబ్బర్ సింగ్
ఫస్ట్ వీక్ షేర్...ట్రేడ్ వర్గాల నుంచి అందిన లెక్కల ప్రకారం
నైజాం : 8.65 కోట్లు
సీడెడ్ : 5.03 కోట్లు
వైజాగ్: 2.26 కోట్లు
ఈస్ట్ : 2.03 కోట్లు
వెస్ట్ : 1.73 కోట్లు
కృష్ణా : 1.82 కోట్లు
గుంటూర్ : 2.45 కోట్లు
నెల్లూరు : 1.03 కోట్లు
కర్నాటక : 1.70
ఇతర రాష్ట్రాలు : 0.73 కోట్లు
మొత్తం షేర్ : 27.4 కోట్లు
ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో ఆల్ టైమ్ రికార్డు అని అంటున్నారు. నిర్మాత గణేష్ బాబు కూడా 81 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రను మా సినిమా తిరగరాసిందని.....ఈ ఫస్ట్ వీక్ కలెక్షన్ల ఆధారంగానే చెప్పినట్లు స్ఫష్టం అవుతోంది.