నయనతార' డర్టీ షో' రేటు 2.5 కోట్లు

నయనతార' డర్టీ షో' రేటు 2.5 కోట్లు

మొన్నామధ్య బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యి జాతీయ అవార్డు సైతం గెలుచుకున్న 'డర్టీ పిక్చర్‌' చిత్రాన్ని అనూష్క తో రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అందులో సిల్క్‌ స్మిత పాత్ర చేయలేనని అనూష్క తేల్చి చెప్పేసింది. ఆల్రెడీ తెలుగులో కూడా రిలీజైన సినిమాని మళ్ళీ రీమేక్ చేయటమెందుకు అన్న ధోరణిలో ఆమె మాట్లాడి నో చెప్పిందని సమాచారం. దాంతో రీసెంట్ గా కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టిన నయనతార ముందుకు సిల్క్‌ పాత్రను తీసుకువెళ్లారు. అయితే నయనతార తాను చేయటానికి ఓకే నే కానీ...తన రేటు మాత్రం కూసింత ఎక్కువేనని తేల్చింది. ఆమె రేటు రెండున్నర కోట్లు అని చెప్పినట్లు సమాచారం. దాంతో వేరే పెద్ద హీరోయిన్స్ ఆసక్తి చూపని ఈ చిత్రాన్ని నయనతార తో చేసి హిట్ కొట్టాలనే ఉత్సాహంలో ఉంది ఏక్తాకపూర్.

సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో రీమేక్ చేయాలని ఏక్తా కపూర్ నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అనువదించి విడుదల చేశారు. కానీ ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తమ పిక్చర్ డర్టీగా ఉంటుందని టైటిల్‌లో చెప్పి మరీ ఏక్తాకపూర్ నిర్భయంగా విడుదల చేసిన చిత్రం ‘డర్టీ పిక్చర్'లో చేయటానికి ఇప్పుడు ఎవరూ ఆసక్తి చూపటం లేదు. 

ఇక అప్పటివరకు హోమ్లీగా కనిపించిన విద్యాబాలన్ ఈ చిత్రంలో హద్దులు దాటి నటించినా ఆ పాత్రకు ప్రజలు నీరాజనం పెట్టారు...అవార్డులు వరించాయి. అనూష్క ని అడగటానికి కారణం వేదం చిత్రంలో సరోజ పాత్ర అని చెప్తున్నారు. అందులోనూ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న వాళ్ళ చేతే చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. మంచి ఓపినింగ్స్ రాబట్టాలంటే ఆ విధమైన స్ట్రాటజీ అవసరమే అంటున్నారు. విద్యాబాలన్ కాకుండా ఎవరో పెద్దగా తెలియని చిన్న ఆర్టిస్టు చేత డర్టీ పిక్చర్ చేయించి ఉంటే ఆ సినిమా చూడటానికి ఎవరికీ ఆసక్తి ఉండేది కాదనే వాస్తవం వివరిస్తున్నారు.


ప్రస్తుతం  నయనతార  తెలుగులో నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది. మరో రెండు తమిళ సినిమాలు సైతం ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్ చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నాడు.