ఎందుకంటే ప్రేమంట' మే 25న

కందిరీగ' హిట్ తర్వాత రామ్ హీరోగా వస్తున్న చిత్రం ఎందుకంటే ప్రేమంట'.
రామ్
సరసన
తమన్నా
హీరోయిన్గా నటిస్తోంది. తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సినీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బేనర్‌పై స్రవంతి రవికిషోర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గతంలో మే 11వ తదీన విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా వేశారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మే 25వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రాన్ని తమిళంలో ఎన్ ఎండ్రల్ కాదల్ ఎన్బెన్' పేరుతో విడుదల చేయనున్నారు.
అబ్బాయి రాసిన లేఖలో పిచ్చి రాతలన్నీ కవితల్లా కనిపిస్తే... అమ్మాయి చేత్తో ఇచ్చిన కషాయం కూడా కమ్మని పానీయంలా అనిపిస్తే... ఆ ఇద్దరూ తప్పకుండా ప్రేమలో ఉన్నట్టే. ప్రేమలోపడితే లోకమే గమ్మత్తుగా అనిపిస్తుంది. అదే విచిత్రాలు చేయిస్తుంది....అనే కాన్సెప్టుతో ఈచిత్రం రూపొందిస్తున్నారు.
యువతరాన్ని వెంటాడే ప్రేమ కథగా ఈ చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్ఫుల్గా చిత్రీకరిస్తున్నారని, జెనీవా స్విట్జర్లాండ్లలో షూట్ చేసిన పాటలు హైలెట్‌గా ఉంటాయని నిర్మాత తెలిపారు. రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
కరుణాకరన్