‘గబ్బర్ సింగ్' ఫస్ట్ డే కలెక్షన్స్

‘గబ్బర్ సింగ్' ఫస్ట్ డే కలెక్షన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తోంది. చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఫస్ట్ డే కలెక్షన్లు భారీగా వసూలయ్యాయి. ప్రముఖ ఆంగ్ల పత్రిక TOI కథనం ప్రకారం గబ్బర్ సింగ్ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 2500 థియేటర్లలో విడుదలై రూ. 10 నుంచి 12 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. అయితే దర్శక నిర్మాతల నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌తో కర్నాటక, తమిళనాడు, విదేశాల్లోనూ ‘గబ్బర్ సింగ్' చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పదేళ్ల తర్వాత పవర్ స్టార్ బాక్సాఫీసుపై తన పూర్తి పవర్ చూపించాడని అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే గబ్బర్ సింగ్  పలు రికార్డులు తిరగ రాయడం ఖాయంగా కనిపిస్తోంది. 

పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిగా.... మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటించారు. 

ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్