ప్రొడ్యూసర్ పై మండిపడ్డ హరీష్

 ప్రొడ్యూసర్ పై మండిపడ్డ హరీష్

నేను పేరు చెప్పను ఓ పెద్ద ప్రొడ్యూసర్ ప్రసాద్ ల్యాబ్ లో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు.. నేను మా ప్రొడ్యూసర్... సినిమాని మే లో రిలీజ్ చెయ్యాలని చెప్పి విపరీతమైన టెన్షన్ లో ఉన్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు పిలిస్తే...పెద్ద ప్రొడ్యూసరూ ఆల్ ది బెస్ట్ చెపుతాడేమో... పరుగెత్తుకుంటూ ఆశగా ఇద్దరం వెళ్లాం. ఆయన కారు కూడా దిగలేదు.శృతిహాసన్ ని పెట్టారమ్మ కొంచెం చూసుకోండి అన్నారు. నాకు అర్దం కాలేదు. ఆ ప్రొడ్యూసర్ కి మా మీద అంత కన్శర్న్ ఉండి ఉంటే...మేం సినిమా ప్రారంభించినప్పుడే ఆ మాట చెప్పాలి అన్నారు హరీష్ శంకర్. శృతి హాసన్ ని రిలీజ్ కు ముందు ఐరన్ లెగ్ అన్నారని ఆయన భాధపడతూ చాలా తీవ్రంగా స్పదింస్తూ ఇలా మాట్లాడారు. 

అలాగే ప్రతీ చోట పవన్ కళ్యాణ్,శృతి హాసన్ అని చెప్తూ వచ్చాం. అప్పుడు ఆయన కన్సర్న్ ఏమైంది అని అడుగుతున్నా...పేరు చెప్పను...ఆయన ఖచ్చితంగా ఇంటర్వూ చూస్తూనే ఉంటారు..చూసి తీరాలి. పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ లో ఓ కొత్త ప్రొడ్యూసర్..ఆల్ మోస్ట్ కొత్త లాంటి డైరక్టరూ వర్క్ చేస్తూంటే చూసి బాగా చేసుకోండి అని చెప్పి వెళ్లవచ్చు... ఇంకో మాట..ఇంకో మాట చెప్పచ్చు..శృతిహాసన్ ని పెట్టారు చూసుకోండి అని చెప్పటంలో ఆయన ఆంతర్యం ఏమిటి అని అడుగున్నాను అన్నారు . 


ఇక ఇండస్ట్రీలో విజయాలు అపజయాలు,అనేవి కామన్..ఇక్కడ వర్క్ అనేది గ్యారెంటీ...పనిని నమ్ముకుని వచ్చిన వాళ్లం...సక్సెస్ నో,ఫెయిల్యూరో నో నమ్ముకుని కాదు..నేను ఫస్ట్ సినిమా ప్లాప్ ఇచ్చాను. లైఫ్ లో రవితేజ నా ఫోన్ ఎత్తకూడదు. కానీ రవితేజ పిలిచి మిరపకాయ సినిమా ఇచ్చాడు. అలాగే గణేషన్న రెండు సినిమాలు సరిగ్గా ఆడలేదు. మరి శృతి హాసన్ సెంటిమెంట్ అయినప్పుడు మా గణేషన్న కూడా సెంటిమెంట్ అవ్వాలిగా... ఇప్పటివరకు మోడ్రన్‌ పాత్రలు వేసింది. కానీ విలేజ్‌ అమ్మాయిగా...తాగుబోతు తండ్రి.. కుమార్తెగా నటిస్తూ బాధ్యతలు తనపై వేసుకునే పాత్ర పోషించి మెప్పింది. ఆమెది ఐరన్‌లెగ్‌కాదు. ఒవాళ ఆ ఒక్క సక్సెస్ తో ఆమె అందరికీ సమాధానం చెప్పింది అని తేల్చి చెప్పారు. 

శృతి హాసన్ ని తీసుకోవటానికి కారణం చెపుతూ...నాకు ఫస్ట్అప్ పోస్టర్ కొత్తగ ఉండాలి...అంటే పవన్ కళ్యాణ్  గారి ప్రక్కన పనిచేసిన హీరోయిన్ కొత్తకాదు..ముందర పోస్టర్ చూడగనే ఇంట్రస్ట్ రావాలి. అంటే కొత్త హీరోయిన్ కావాలి. అంటే కొత్త హీరోయిన్ అనగానే...కొత్త అని కాదు పవన్ గారి ప్రక్కన చెయ్యని హీరోయిన్ కావాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకోసం శృతి గారిని ఎప్రోచ్ అయ్యాను. శృతి హాసన్ అనుకోగానే నా మైండ్ లో ఓ ప్రేమ్ ఫిక్సయింది. 


లంగా ఓణీల్లో ఓ పల్లెటూరి అమ్మాయిగా ఆమె కనపడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆమె అన్ని అర్బన్ పాత్రలే చేసింది. ఇక శృతి అనగానే ఆమె ఫెయిల్యూర్ హీరోయిన్ అని,గత చిత్రాలు ఆడలేదని చాలా మంది, అంటే ఇవాళ గట్టిగా చెప్పలేని పరిస్ధితి ఉంది...పేర్లు నేను చెప్పను...చాలా మంది ప్రొడ్యూసర్స్ ..చాలా మంది టెక్నీషియన్స్ ..వాళ్లూ వీళ్లూ...శృతి హాసన్ ..శృతి హాసన్ ఏంటి అని ...మాట్లాడారు.