మహేష్ బాబును మించి పోయిన సిద్ధార్థ్

మహేష్ బాబును మించి పోయిన సిద్ధార్థ్

సూపర్ స్టార్ మహేష్ బాబు... టాలీవుడ్‌లో టాప్ పొజిషన్లో ఉన్న హీరో. హీరో సిద్ధార్థ విషయానికొస్తే ఓ మోస్తరు రేంజి ఉన్న హీరో. ఏ విషయంలో చూసినా మహేష్ బాబుకు, సిద్ధార్థకు చాలా తేడా ఉంటుంది. అసలు మహేష్ బాబును ఊహలో కూడా అందుకోలేని స్థాయి సిద్దార్థది. కానీ ఓ విషయంలో మాత్రం సిద్ధార్థ మహేష్ బాబును బీట్ చేశాడు. 

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో అత్యధికంగా ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్న హీరో ఎవరంటే మహేష్ బాబు పేరు ముందుగా వినిపించేది. కానీ ఇప్పడు మహేష్ బాబును అధిగమించి ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో నెం.1 పొజిషన్లోకి వెళ్లాడు ఈ కుర్ర హీరో.
ప్రస్తుతం సిద్ధార్థ ట్విట్టర్లో 4,00,000 మ్యాజికల్ ఫిగర్‌ను క్రాస్ చేశాడు. 

3,41,000 మంది ఫాలోవర్స్‌తో మహేష్ బాబు రెండో స్థానంలో ఉన్నాడు. 2,38,759 ఫాలోవర్స్‌తో రాణా దగ్గుబాటి మూడో స్థానంలో ఉండగా... ఆ తర్వాతి స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉన్నాడు. చెర్రీకి ట్విట్టర్లో 2,01,000 పైచిలుకు ఫాలోవర్స్ ఉన్నారు.