ఢిల్లీలో డిఎల్ మకాం

ఢిల్లీలో డిఎల్ మకాం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అగ్గి మీద గుగ్దిలమవుతున్న ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటున్నారు. ఢిల్లీ పర్యటన తన వ్యక్తిగతమని, వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నానని ఆయన చెప్పినప్పటికీ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.

తాను అపాయింట్‌మెంట్ కోరానని, అపాయింట్‌మెంట్ ఇస్తే సోనియాను, ఆజాద్‌ను కలుస్తానని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. వారిని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తానని, అలా చెప్పకపోతే తప్పు చేసినవాడిని అవుతానని ఆయన అన్నారు. ఇప్పుడైతే పరిస్థితి బాగానే ఉందని, ఉప ఎన్నికల వల్ల యుద్ధవాతావరణం నెలకొని ఉందని ఆయన చెప్పారు. 

తనను పిలిస్తే ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, ఉప ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేమని ఆయన అన్నారు. జయాపజయాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. తమ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇప్పుడే కలిశారని, విహెచ్‌ను శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు ప్రచారం కోసం పిలిచారని, అలా పిలిస్తే తాను కూడా వెళ్తానని అన్నారు. కడప లోకసభ స్థానంలో డిపాజిట్ కోల్పోయాడు, ఏం పిలుస్తామని కొంత మంది తనప