మలైకా అరోరా 'కెవ్వు కేక'ఫస్ట్ లుక్

మలైకా అరోరా 'కెవ్వు కేక'ఫస్ట్ లుక్

పవన్ 'గబ్బర్ సింగ్' చిత్రం గురించి మాట్లాడితే మొదట కెవ్వు కేక పాట గురించే ప్రస్దావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అందులో ఆమె డాన్స్ ఎలా ఉండబోతోంది. ఆమె గెటప్ ఎలా ఉండబోతోంది అన్న విషయాలు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. దాంతో ఫిల్మ్ మేకర్స్ ఆమె పోజులతో ఉన్న స్టిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. మే 10న విడుదల అవుతున్న విడుదల అవుతున్న ఈ చిత్రంలో ఈ పాట స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఈ పాట విడుదలైన నాటినుండే అంతటా సంచలనం క్రియేట్ చేసింది. 

ఇక గబ్బర్ సింగ్ ఆడియోనే ఇలా ఉందంటేఇక వీడియో చూస్తే ఏ రేంజ్‌లో ఉంటుందోనని అభిమానులు అంచనాలు వేసుకుంటూ ఎదురూచూస్తున్నారు. ఇక అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసి పోకుండా ఈ ఐటం సాంగు ఉంటుందని, అందుకే ఈ పాట కోసం ‘మున్నీ బదనాం హుయే' ఫేం మలైకా అరోరాను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అందాలు ఆరబోయడానికి, అంగాంగ ప్రదర్శన చేయడానికి ఏమాత్రం సంకోచించని మలైకా అదరకొట్టిందని యూనిట్ సభ్యులు అంటున్నారు. గతంలోనూ మహేష్ తో అతిధిలో...రాత్రైనా పగలైనా నాకు ఒకే అంటూ మలైకా యూత్ ని ఓ రేంజిలో కేక పుట్టించింది.

అలాగే  గబ్బర్ సింగ్  ‘కెవ్వు కేక' పాట చిత్రీకరణ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగింది. మున్నీ బదనాం హుయే పాటకు ఏ మాత్రం తగ్గకుండా పాటను చిత్రీకరించారని సమాచారం. మాస్ మెచ్చే మసాలా బాగా దట్టించి ఈ పాటను ఓ రేంజ్ లో చిత్రీకరించారని,ఈ పాట చిత్రీకరణలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ ఒకటికి రెండు సార్లు స్టెప్స్ చెక్ చేసి మరీ ఫైనల్ చేసాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ పాటలో డాన్స్ చేసినందుకు కానూ మలైకా అరోరాకు రూ. కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ , శృతి హాసన్,  మలైకా అరోరా , అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాశీభట్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్