అమాయకురాలిని కాదు నేను:అనూష్క

అమాయకురాలిని కాదు నేను:అనూష్క

నా పెళ్లి విషయంలో మా అమ్మా, నాన్నా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇందులో వాళ్ల ప్రమేయం పెద్దగా ఉండదు. నేను ‘ఓకే' అన్నప్పుడే వాళ్లు ప్రయత్నాలు మొదలుపెడతారు. అంతే తప్ప... నన్ను ఇబ్బంది పెట్టి పెళ్లి చేయరు. కెరీర్ మంచి స్పీడ్ మీద ఉన్న టైమ్‌లో ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకొనే అమాయకురాలిని కాదు నేను అంటోంది అనుష్క. ఆమె రీసెంట్ గా పెళ్లి చేసుకోబోతోందని,ఆమె తల్లి తండ్రలతో బెంగుళూరు వెళ్లి ఈ విషయమై మాట్లాడిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఆమెను అడిగినప్పుడు ఇలా స్పందించింది.

మరో ప్రక్క అనూష్క త్వరలో డర్టీ పిక్చర్ రీమేక్ లో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. త్వరలో ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో రీమేక్ చేయాలని ఏక్తా కపూర్ నిర్ణయించుకుందని సమాచారం. అందుకోసం అంతటి ఫెరఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్టుగా అనుష్కను భావించి సంప్రదించాలనుకుంటున్నారని తెలుస్తోంది. తమ పిక్చర్ డర్టీగా ఉంటుందని టైటిల్‌లో చెప్పి మరీ ఏక్తాకపూర్ నిర్భయంగా విడుదల చేసిన చిత్రం ‘డర్టీ పిక్చర్'లో చేయటానికి అనూష్క ఓకే చేసే అవకాశం ఉందనే చెప్తున్నారు. ఇక అప్పటివరకు హోమ్లీగా కనిపించిన విద్యాబాలన్ ఈ చిత్రంలో హద్దులు దాటి నటించినా ఆ పాత్రకు ప్రజలు నీరాజనం పెట్టారు...అవార్డులు వరించాయి. 

అయితే ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అనువదించి విడుదల చేశారు. కానీ ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందుకు ప్రేరణ వేదం చిత్రంలో సరోజ పాత్ర అని చెప్తున్నారు. ‘వేదం'లో వేశ్యగా... భిన్న కోణాలున్న ఈ పాత్రలకు ఆహార్యం, అభినయం పరంగా అనుష్క కనబర్చిన వ్యత్యాసాన్ని వీరు తమ చిత్రంకి ఎస్సెట్ అవుతుందంటున్నారు. అందులోనూ తెలుగు, తమిళ భాషల్లో అనూష్క కి మంచి క్రేజ్ ఉంది. కాబట్టి... దక్షిణాది ‘డర్టీ పిక్చర్'కి అనుష్కే కరెక్ట్ అని కూడా నిర్మాత ఫిక్స్ అయ్యారని ముంబై వర్గాల సమాచారం. 


అలాగే అనూష్క ఆమె ఓ గెస్ట్ రోల్ కమిటైంది.సూర్య సోదరుడు కార్తీ హీరోగా నటిస్తున్న శకుని చిత్రంలో ఆమె గెస్ట్ గా కనిపించనుంది.అయితే ఆమెది ఐటం సాంగ్ కూడా ఉండే అవకాసం ఉందని చెప్తున్నారు.ఇక కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మాతగా కార్తి తన స్వంత బ్యానర్ స్టూడియో గ్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేయనున్నాడు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. బావ చిత్రంలో సిద్దార్ధ సరసన చేసిన ప్రణీత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మాజీ హీరోయిన్ రాధిక ప్రధానపాత్ర పోషిస్తున్నారు.ఆమెది నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ అని తెలుస్తోంది.ఈ చిత్రం షూటింగ్ క్లైమాక్స్ స్టేజికి చేరుకుంది.