జాన్ అబ్రహంకు జైలు శిక్ష లేదు

జాన్ అబ్రహంకు జైలు శిక్ష లేదు

రాష్ డ్రైవింగ్ కేసులో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంకు ఊరట లభించింది. జాన్ అబ్రహంను జైలుకు పంపించబోమని బొంబాయి హైకోర్టు తెలిపింది. జాన్ అబ్రహం రాష్ డ్రైవింగ్ కేసుపై బొంబాయి హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే మొదటి కేసు కాబట్టి ప్రొబెషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద జాన్ అబ్రహంను వదిలేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

  
బాధిత కుటుంబ సభ్యులకు పది వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని హైకోర్టు జాన్ అబ్రహంను ఆదేశించింది. 2006లో జాన్ అబ్రహం రాష్ డ్రైవింగ్ వల్ల ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ముంబైలోని ఖర్ దండా ఏరియాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గాయపడిన ఇద్దరిని జాన్ అబ్రహం ఆస్పత్రిలో చేర్చారు.

కోర్టు విచారణకు జాన్ అబ్రహం హాజరయ్యాడు. 2010లో జాన్ అబ్రహంను కోర్టు దోషిగా నిర్ధారించి, 15 రోజులు జైలుకు పంపించింది. హైకోర్టు 2012 మార్చిలో బెయిల్ మంజూరు చేసింది. ఆరేళ్ల న్యాయ పోరాటం తర్వాత జాన్ అబ్రహంకు ఊరట లభించింది.  జాన్ అబ్రహం  పలు హిందీ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.