ఎన్టీఆర్ కు పూరీ స్పెషల్ బర్తడే విషెష్

ఎన్టీఆర్ కు పూరీ స్పెషల్ బర్తడే విషెష్

 నిన్న ఆదివారం పుట్టిన రోజుని జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఇటలీలో ఉన్న పూరీ జగన్నాధ్ ప్రత్యేకంగా తన విషెష్ ని యూ ట్యూబ్ లో ఓ వీడియోని అప్ లోడ్ చేసి తెలియచేసారు. అందులో...పూరీ మాట్లాడుతూ..బయ్యా..హ్యాపీ బర్తడే..మేం ఇటలీలో ఉన్నాం..మిస్సింగ్ యువర్ బర్తడే...అన్నారు. ఆ తర్వాత అక్కడున్న యూనిట్ అందరిచేతా బర్తడే విషెష్ చెప్పించారు. చివరగా...మళ్లీ హ్యాపీ బర్తడే బయ్యా...అందరూ నిన్ను మిస్సవుతున్నారు..హ్యాపీ బర్తడే...సీయు సూన్ అన్నారు.

అదే వీడియోలో రవితేజ మాట్లాడుతూ...విష్ యు మెని మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తారక్..బంగారం హ్యాపీ బర్తడే అన్నారు. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాధ్,రవితేజ కాంబినేషన్ లో రూపొందుతున్న దేముడు చేసిన మనుష్యులు షూటింగ్ నిమిత్తం ఇటలీలో ఉన్నారు. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీగా రూపొందుతోంది. రఘు కుంచె సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టాకీ పూర్తైనట్లు,కేవలం పాటలు బ్యాలెన్స్ ఉన్నట్లు చెప్తున్నారు. 

ఇక ఎన్టీఆర్,పూరీ జగన్నాధ్ సినిమా విషయానికి వస్తే... ప్రాజెక్టు గురించి పూరీ మాట్లాడుతూ...''ఇదో ప్రేమకథ. యాక్షన్‌తో పాటు అన్ని అంశాలూ ఉంటాయి. ఎన్టీఆర్‌ని మరో కోణంలో చూస్తారు అన్నారు.ఎనిమిదేళ్లుగా నేను, జగన్‌, అభిమానులు ఎదురుచూస్తోన్న సినిమా ఇది. మేమిద్దరం కలిశామంటే అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునే కథ దొరికింది అన్నారు ఎన్టీఆర్. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో సినిమా చేయటానికి కమిటైన ఎన్టీఆర్ ఇలా స్పందించారు.'ఆంధ్రావాలా' తరవాత ఎన్టీఆర్‌ -పూరి జగన్నాథ్‌ కలయికలో వస్తున్న చిత్రమిదే. నటుడు బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ .. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్షా' చిత్రం చేస్తున్నారు. అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్న సినిమా కంప్లీట్ చేస్తారు.