ముమైత్ ఖాన్ చుట్టూ తిరిగే స్టోరీ

ముమైత్ ఖాన్ చుట్టూ తిరిగే  స్టోరీ

మహారాష్ట్రలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో విభిన్న కథా చిత్రం రూపొందనుంది. బి.ఎస్. ఎంటర్ టైన్మెంట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా కె.ఎస్.ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆంటీ అంకుల్ నందగోపాల్' దర్శకుడు డి.వి.కె. నాగేశ్వరరావు తన ద్వితీయ చిత్రంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

మే మూడో వారంలో ప్రారంభం కానున్న ఈచిత్రం గురించి నిర్మాత కె.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ..‘మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటనకు ఇన్ స్పైర్ అయి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. కథ మొత్తం ముమైత్ ఖాన్ చుట్టూ తిరుగుతుంది. మే మూడో వారంలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాము.

ప్రస్తుతం ప్రవీణ్ ఇమిడి సంగీత దర్శకత్వంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఓ యువ జంట హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఆ హీరో హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. సబ్జెక్టు డిమాండ్ మేరకు బడ్జెట్ కి వెనకాడకుండా ఈచిత్రాన్ని భారీగా నిర్మించడానికి ప్లాన్ చేశాం. బ్యాంకాక్, హైదరాబాద్, ముంబైలలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది' అన్నారు. 

ముమైత్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం , ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, ఎం.ఎస్. నారాయణ, కృష్ణ భగవాన్, భరత్, పృథ్వీ, మాస్టర్ భువన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్, ఎడిటింగ్ నందమూరి హరి, ఫైట్స్: నందు, నిర్మాత: కె.ఎస్. ప్రసాద్, కథ స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డి.వి.కె. నాగేశ్వరావు.