ఆ వార్తలపై మండి పడుతున్న నయనతార!

ఆ వార్తలపై మండి పడుతున్న నయనతార!

నయనతార సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నేపథ్యంలో ఆమెపై మళ్లీ గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్న వారిపై ఇవన్నీ కామనే. నయనతార అందుకు అతీతమేమీ కాదు. దీంతో షరామామూలుగానే నయనతార కూడా అలాంటి వార్తలపై మండి పడుతూ మీడియాకు టచ్‌లో ఉంటోంది.

ఇటీవల నయనతార చెన్నయ్ ఎయిర్ పోర్టులో నుంచి తిరిగి వస్తుండగా...కస్టమ్స్ అధికారులు ఆమెను చెక్ చేశారు. దీంతో నయనతార ఏదో తప్పు చేసిందని, ఆమె చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే నయనతార మాత్రం అలాంటిదేమీ లేదని, రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే తనిఖీలు చేశారని అంటోంది. తన చేతిపై  ప్రభుదేవా పేరుతో ఉన్న పచ్చబొట్టును తొలగించుకోవడానికి అమ్మడు బ్యాంకాక్ వెళ్లిందనే వార్తలు కూడా ఆమధ్య వినిపించాయి.

తిరిగి సినిమాల్లోకి వస్తున్నాను అని నయనతార ప్రకటించిందే ఆలస్యం ఆమె ముందు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. అందిరిపోయే అందం, చక్కని అభినయం, యూత్‌ మతి పోగొట్టే హొయలు ఆమె సొంతం. అందుకే నయన తారకు క్రేజ్ ఇప్పటి వరకు తగ్గలేదు. ప్రస్తుతం నయనతార పలు తెలుగు, తమిళం ప్రాజెక్టులో బిజీగా గడుపుతోంది.  నాగార్జున , దశరత్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇవే కాకుండా రాణా హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్,  నయనతార కాంబినేషన్ లో భూపతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘భూలోగం' అనే తమిళ చిత్రానికి సంబంధించి ఇటీవలే దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. ఈ చిత్రం ద్వారా కళ్యాణ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు ఆమెకు స్కిప్టు చెప్పగా బాగా నచ్చి వెంటనే ఒకే చెప్పిందట.