తమ్ముడి హత్య కేసులో పాస్టర్ పాల్ అరెస్టు

తమ్ముడి హత్య కేసులో పాస్టర్ పాల్ అరెస్టు

 క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో ఆయనను పోలీసులు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అరెస్టు చేశారు. డేవిడ్ రాజ్ రెండేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురయ్యాడు. ఆ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పాల్ తమ్ముడు డేవిడ్ రాజు 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 

డేవిడ్ రాజుకు, కెఎ పాల్‌కు మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఈ ఆస్తి తగాదాల కారణంగానే డేవిడ్ రాజును కెఎ పాల్ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆస్తులపై పరస్పరం కేసులు పెట్టుకుని వివాదానికి దిగారు. పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి కొంత మంది క్రైస్తవ మత పెద్దలు ప్రయత్నించారు. 

కెఎ పాల్ వద్దకు పోలీసులు స్పై కెమెరా తీసుకుని వెళ్లారు. డేవిడ్ రాజు హత్య కేసులో అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులకు కోటి రూపాయలు ఇస్తానని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. అందుకు ముందస్తుగా మూడు లక్షల రూపాయలు ఇవ్వజూపాడు. దీన్నంతా పోలీసులు స్పైకెమెరాలో బంధించి, సోమవారం తెల్లవారు జామున అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై ఇన్నోవా కారు ముందు సీట్లో డేవిడ్ రాజు శవం పడి ఉంది. అప్పట్లో దాన్ని గుర్తు తెలియని శవంగా పోలీసులు భావించారు. ఆ తర్వాత అతను డేవిడ్ రాజు అని గుర్తించారు. అప్పటి నుంచి పోలీసులు కెఎ పాల్‌పై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కారు వెనక సీట్లో రక్తం మరకలున్నాయి. కారులో మూడు వాహనాల నెంబర్ ప్లేట్లు కనిపించాయి. వాటిలో ఒక్కటి టూ వీలర్ వాహనానిది. దీంతో పోలీసులు డేవిడ్ రాజు మృతిపై పోలీసులు దర్యాప్తు సాగించారు. 

పాల్ అమెరికాలో ఉన్న కాలంలో ఆయన ఆస్తులను డేవిడ్ రాజు చక్కబెట్టేవాడు. అయితే, అమెరికాలో వివాదాల కారణంగా పాల్ తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత డేవిడ్ రాజుకు, పాల్‌కు మధ్య ఆస్తులకు సంబంధించి వివాదాలు చెలరేగాయి. తన తండ్రి మృతిపై డేవిడ్ రాజు కుమారుడు సాల్మన్ రాజు అనుమానం వ్యక్తం చేశారు