ఎన్టీఆర్ కు పవన్ ట్విస్ట్ ఇస్తాడా?

ఎన్టీఆర్ కు పవన్ ట్విస్ట్ ఇస్తాడా?

గబ్బర్ సింగ్ ఈ పదవ తేదీన భారీగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎఫెక్టు పూర్తిగా దమ్ము చిత్రంపై పడనుందని సమాచారం. ఎందుకంటే దమ్ము ధియోటర్స్ లో చాలా భాగం ఇప్పుడు గబ్బర్ సింగ్ కి కేటాయిస్తున్నారు. అసలే డివైడ్ టాక్ తో కలెక్షన్స్ డ్రాప్ అవుతున్న నేపధ్యంలో ఇది ఇబ్బందికరమైన పరిస్దితే అంటున్నారు. మరో రెండు వారాలు కలెక్షన్స్ గట్టిగా వస్తేగానీ బ్రేక్ ఈవెన్ రాదు. ఈ నేపధ్యంలో ముఖ్యంగా బి,సి సెంటర్లలో గబ్బర్ సింగ్ ఎఫెక్టు ఎంతవరకూ ఉండబోతోందనేది ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. అక్కడ వారాంతానికి గబ్బర్ సింగ్ రావటంతో కొత్త చిత్రంపై మోజుతో ఈ సినిమా వైపు క మ్రొగ్గు చూపరని,ఇప్పుడిప్పేడే అభిమానులు కాకుండా ఫ్యామిలీస్ ..దమ్ము వైపుకు మళ్లుతున్నారని,దాన్ని గబ్బర్ సింగ్ గండి కొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు.

మరో పదిహేను రోజులు దాకా  దమ్ము  బిజినెస్ స్టామినా ఉంటుందని, అయితే గబ్బర్ సింగ్ ఏ రేంజి హిట్ అవుతుందనే దానిపైనే ఈ లెక్కలు ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకూ కలెక్షన్స్ స్టడీగా ఉండటం ఊరట కలిగించే అంశమని,ఎ సెంటర్లలో, ముఖ్యంగా సిటీలలో ఈ చిత్రం కలెక్షన్స్ తగ్గాయని,అయితే వారాంతరాలలో అక్కడ కూడా హౌస్ ఫుల్ అవుతాయని అంటున్నారు. ఈ ఎఫెక్టు రచ్చకు తగిలే అవకాశం లేదు. ఎందుకంటే రచ్చ చిత్రం రిలీజే ఐదు వారాలు దాటటం కలిసి వచ్చిందని అంటున్నారు. రెండు వారాల తేడాలో పెద్ద సినిమాలు విడుదల అయితే దాని ప్రభావం ఉంటుందని అంటున్నారు. మరో ప్రక్క రవితేజ దరువు కూడా ఇదే వారంలో రావటం గమనార్హం. 

వీటికి తోడు గబ్బర్ సింగ్ కు ధియోటర్స్ ఇవ్వటానికి ఈ రోజుల్లో,ప్రేమలో పడితే ధియోటర్స్ కూడా ఖాళీ చేసి ఇవ్వాల్సిన పరిస్దితి ఉంది. దాంతో తమ చిన్న సినిమాలకు కలెక్షన్స్ బాగానే ఉన్నా తప్పనిసరి పరిస్దితుల్లో తప్పుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు దాదాపుగా చిన్న సినిమాలు విడుదలలు పెట్టుకోరు. ఎందుకంటే చిన్న సినిమా హిట్టైనా ధియోటర్స్ దొరకక నిలబడే ఛాన్స్ ఉండదు కాబట్టి వాటిని వాయిదా వేసుకుంటారు. అయితే వరసగా పెద్ద సినిమాలు విడుదల అవుతూంటే ఎక్కువ కాలం వెయిట్ చేయటం చిన్న సినిమాలకు కష్టం. వాటి ఫైనాన్స్ లు పెరిగిపోతూంటాయి. దాంతో ముందు రిలీజ్ చేసి బయిటపడదామనే ప్రయత్నాలు చేస్తూంటారు. 

ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా గబ్బర్ సింగ్ హవానే కనపడుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. హిందీలో హిట్టైన దబాంగ్ రీమేక్ కావటం,పంచ్ డైలాగులతో వదిలిన ప్రోమో కావటం,ఈ చిత్రంకోసం చేసిన కెవ్వు కేక ఐటం సాంగ్,ఇలా ప్రతీ విషయంలోనూ  గబ్బర్ సింగ్  అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని రేపుతుంది. పవన్ సైతం ఈ చిత్రాన్ని ప్రత్యేకమైన శ్రద్దతో చేసి,తిరిగి హిట్ తో ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు.