నిరూపిస్తే దేనికైనా రెడీ : నట్టి కుమార్

నిరూపిస్తే దేనికైనా రెడీ : నట్టి కుమార్

రి హంతకుడు భానుతో కలిసి నట్టి కుమార్ తనను బెదిరించాడని, తన వద్ద అప్పుగా తీసుకున్న కోటి రూపాయలను ఇవ్వకుండా వేధించాడని ఫైట్ మాస్టర్ సుందర్ సిఐడిలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో..... నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. సుందర్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 

సుందర్ ఓ రౌడీ షీటర్ అని మండి పడ్డ నట్టి కుమార్...తాను అతని వద్ద కోటి రూపాయలు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఇదంతా భానుతో సంబంధాలు ఉన్న నిర్మాత సి. కళ్యాణ్ ఆడిస్తున్న నాటకమని నట్టి ఆరోపించారు. నిజా నిజాలు త్వరలోనే తేలుతాయన్నారు. 

గత కొన్ని రోజుల క్రితం నట్టి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సి కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. సి కళ్యాణ్ భానుకు బినామీ అని, భాను అక్రమంగా సంపాదించిన డబ్బును సి కళ్యాణ్ ద్వారా సినిమాల్లో పెట్టుబడులు పెట్టించాడని ఆరోపించారు. అనేక క్రమినల్ కేసులు సి కళ్యాణ్‌పై ఉన్నాయని, అలాంటి నేరచరిత్ర గల వ్యక్తిని నిర్మాతల మండలిలో కొనసాగనివ్వడం ఏమిటని ప్రశ్నించారు. 

దాసరి నారాయణ రావు లాంటి పెద్దలు నట్టి కుమార్ లాంటి వారిని ఎందుకు ఉండనిస్తున్నారో అర్థం కావడం లేదని, పరిశ్రమలోని ఇతర పెద్దలు కలుగజేసుకుని సి కళ్యాణ్ లాంటి వారిని సినీ పరిశ్రమ నుంచి బయటకు పంపాపాలని డిమాండ్ చేశారు. అయితే నట్టి వ్యాఖ్యాలపై అటు దాసరి గానీ, ఇతర పెద్దలుగానీ స్పందించ లేదు. పైగా గబ్బర్ సింగ్ స్పెషల్ షోకు హాజరైన దాసరికి సి కళ్యాణ్ వెన్నంటే ఉండటం గమనార్హం.