భాను బినామీ సి. కళ్యాణ్ : నట్టి

భాను బినామీ సి. కళ్యాణ్ : నట్టి

సూరి హంతకుడు భానుకు సినీ రంగంలోని పలువురు నిర్మాతలు, హీరోయిన్లతో సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను బయట పెట్టారు. ఈ రోజు నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ....నిర్మాత సి. కళ్యాణ్ భానుకు బినామీయే అని నొక్కి చెప్పారు. సి. కళ్యాణ్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. వీరిద్దరు అక్రమ డాక్యుమెంట్లతో బ్యాంకులకు కోట్లకు టోకరా వేశారని నట్టి ఆరోపించారు.

ఇటు దర్శక రత్న దాసరి నారాయణరావును కూడా నట్టి కుమార్ విమర్శించారు.  భానుతో  లింకులు ఉన్న సి. కళ్యాణ్ లాంటి వారిని పరిశ్రమలో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. భూదందాలు లాంటి క్రిమినల్ కేసుల్లో ఉన్న సి. కళ్యాణ్ లాంటి వారిని నిర్మాతల మండలి నుంచి తప్పించాలని, లేకుంటే పరిశ్రమకు చెడ్డపేరు వస్తుందన్నారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి ఇలాంటి ఏమీ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. 

భానుకు పరిశ్రమలోని హీరోలు, పెద్ద నిర్మాతలతో సంబంధాలు ఉన్నాయని నట్టి ఆరోపించారు. హీరోయిన్లతో భానుకు ఉన్న సంబంధాల విషయమై నట్టి స్పందిస్తూ.....నాకు తెలియని విషయాలు మాట్లాడను, నిర్మాతలకు అండగా ఉంటాం కాని క్రిమినల్స్ కు కాదు, చీటింగు మోసాలలో నేను లేను అని స్పష్టం చేశారు. 

నేను ఎలాంటి తప్ప చేయలేదని, తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న ఆయన... నాకు ఎలాంటి నోటీసులు రాలేదు, నేను అందరికీ అందుబాటులో ఉన్నానని చెప్పారు. ఒక వేళ నన్న పోలీసులు విచారిస్తే సహకరిస్తానన్నారు. జీవితంలో ఎంతో కష్ట పడి నిర్మాత స్థాయికి ఎదిగానని  నట్టి కుమార్  వెల్లడించారు.