30న ‘ఈగ'రిలీజ్ చేయటం లేదు:రాజమౌళి

30న ‘ఈగ'రిలీజ్ చేయటం లేదు:రాజమౌళి

ఈ నెల 30న ‘ఈగ'ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆ మధ్య రాజమౌళి ట్విట్టర్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. కానీ, ‘విడుదల తేదీని మారుస్తున్నందుకు క్షమించమని కోరుతున్నాను' అంటూ ఆదివారం ట్విట్టర్‌లో మరో మెసేజ్ పోస్ట్ చేశారు రాజమౌళి. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న ఈగ మరోసారి వాయిదా పడటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ విషయమై తనూ భాధపడుతున్నానని,క్షమించమని కోరుతూ రాజమౌళి ట్వీట్ చేసారు.


రాజమౌళి ట్వీట్ లో...‘‘సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్)కి పట్టే సమయం గురించి తక్కువ అంచనా వేశాను. కానీ ఈ గ్రాఫిక్స్ వర్క్‌కి చాలా టైమ్ తీసుకుంటోంది. అందుకే విడుదల తేదీని వాయిదా వేశాం. ఇప్పటివరకు చేసిన సీజీ వర్క్ బాగా వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది. మిగిలిన సన్నివేశాలకు సంబంధించిన గ్రాఫిక్స్ కూడా ఇంతే క్వాలిటీగా ఉండేలా చేస్తున్నాం. ఈ చిత్రం విడుదలను వాయిదా వేసినందుకు బాధపడుతున్నాను. ఈ మెసేజ్ చూసి మీరూ నిరుత్సాహపడే ఉంటారు. అందుకే క్షమించమని కోరుతున్నా'' అన్నారు.


నాని, సమంత, సుదీప్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ ఎత్తున క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి ఆయన మీడియా తో మాట్లాడుతూ...చీమ - ఏనుగూ మధ్య గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? దోమతో సింహం ఫైటింగుకి దిగితే ఏం జరుగుతుంది? రెండు ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై బలవంతులదే రాజ్యం. అయితే ఈ అహంకారం, అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ 'ఈగ' మనిషిపై పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే.

'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్‌ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చెబుతూ 'సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు.