'గబ్బర్ సింగ్'పై జీవిత కామెంట్

'గబ్బర్ సింగ్'పై జీవిత  కామెంట్

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్ సింగ్'లో రాజశేఖర్ పై సెటైరిక్ గా పవన్ కామెంట్ చేసిన ఉన్న సంగతి తెలిసిందే. అంత్యాక్షరి పేరుతో అందరి హీరోలను అనుకరించాం అని దర్శకుడు హరీష్ శంకర్ వివరించినా ప్రత్యేకంగా రాజశేఖర్ లా పవన్..ఏమి సేత్తిరి..ఏమి సేత్తిరి అంటూ గొంతు మార్చి వచ్చి రాని తెలుగులో వ్యాఖ్యానించారు. థియేటర్ వరకూ అది నవ్వులు కురిపించినా రాజశేఖర్ దంపతులకు మాత్రం అది తగులుతుందని అందరూ ఊహించారు. వారు సినిమా చూసి కామెంట్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. 

ఈ నేపధ్యంలో జీవిత,రాజశేఖర్ దీనిపై స్పందిస్తూ...మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి ..రాజశేఖర్ ని అనుకరించి పాపులర్ అయి డబ్బు సంపాదించుకున్నారు. అది తెలిసి మేము చాలా ఆనందించాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కోసం అదే రిపీట్ చేసారని విన్నాము. అదే నిజమైతే కంటిన్యూ ప్లాప్ ల తర్వాత పవన్ కళ్యాణ్ హిట్ కొట్టటం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. 

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లో రాజశేఖర్ పై వేసిన సెటైర్స్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ ని మీడియా ప్రశ్నించింది. దానికి హరీష్ స్పందిస్తూ...రౌడీల అంత్యాక్షరిలో కొందరు హీరోల శైలిని అనుకరించేలా కొన్ని సన్నివేశాలుండొచ్చు. కానీ అవమానపరిచే సన్నివేశాలు మాత్రం ఇందులో లేవు. రోజూ టీవీల్లో రాజకీయ నాయకుల నుంచి సినీ తారల వరకు అందర్నీ అనుకరిస్తుంటారు. అందులో తప్పేముంది? ఆ మాటకొస్తే ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ ముందు, ఆయన్నే అనుకరించే సన్నివేశాలున్నాయి కదా అన్నారు.

ఇక సెకండాఫ్ లో ...రౌడి లతో పవన్ కళ్యాణ్ ..అంత్యాక్షరి పాడిస్తారు. అందులో ..రాజశేఖర్ ని అనుకరిస్తూ ఓ రౌడి పాడతాడు. రోజ్ ..రోజ్ రోజా పువ్వా అంటూ అల్లరి ప్రియుడులో సాంగ్ పాడతాడు. దానికి  పవన్ కళ్యాణ్  ...  రాజశేఖర్  ని అనుకరిస్తూ..వచ్చిరాని తెలుగులో తమిళ యాసలో...

పవన్: అబ్బ.. అబ్బబ్బ ఏమి సేత్తిరి ఏమి సేత్తిరి... ఎప్పుడూ ఇలానే సేస్తిరా.. లేక ఇంతకు ముందు కూడా ఇలా సేస్తిరా... ఏ సాంబ ఏమంటావ్.. 

అలీ: అబ్బా.. నాధేముంధీ బంగారం.. కానీ మనల్నే ఎవరు అర్ధం చెస్కోవటం లెఢు.

ఇక ఈ సెటైర్ మాత్రం ధియోటర్ లో బాగా పేలింది. విపరీతమైన అప్లాజ్ వచ్చి ఈ రోజు సినిమా హిట్స్ కి కారణాల్లో అది ఒకటిగా మారింది.