‘ఈగ'శాటిలైట్ రైట్స్ రేటు

 ‘ఈగ'శాటిలైట్ రైట్స్ రేటు

రాజమౌళి తాజా చిత్రం ‘ఈగ'ఈ నెల 30న విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమింళంలో ‘నాన్ ఈ' టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్ శాటిలైర్ రైట్స్ ఓ రేంజిలో పలికి అందరికీ షాక్ ఇచ్చింది. తమిళంలో నెంబర్ వన్ ఛానెల్ అయిన సన్ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 3.35 కోట్లుకు కొనుగోలు చేసారు. ఓ తెలుగు డైరక్టర్ డైరక్ట్ చేసిన చిత్రానికి ఈ రేంజి రేటు పలకటం తమిళ శాటిలైట్స్ హిస్టరీలోనే ఓ పెద్ద రికార్డు అంటున్నారు. నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను పీవీపీ సినిమా నిర్మిస్తోంది. 

ఈ చిత్రం విడుదల సందర్భంగా చెన్నైలో తమిళ వెర్షన్ నిర్మాత ప్రసాద్ పొత్తూరి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...హాలీవుడ్ స్థాయికి దీటుగా గ్రాఫిక్స్ సన్నివేశాలను ‘నాన్ ఈ' కోసం రూపొందించారు. ఈ చిత్రానికి యూఎస్‌ఏ, రష్యా, పోలెండ్ దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు పని చేయడం విశేషం. ప్రేమ, ప్రతీకారం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఆరు నెలల క్రితమే పూర్తి అయ్యింది .  దర్శకుడు రాజమౌళి  నిర్మాణాంతర కార్యక్రమాలపై దృష్టి సారించారు. చిన్న,పెద్ద తేడాలేకుండా అందరినీ అలరించేలా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

ఇక రాజమౌళి ఈగని బైలింగ్వల్ గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. మీడియాలో ఈగ చిత్రాన్ని నాన్ ఈ అనే టైటిల్ తో తమిళంలో డబ్బింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ మాట్లాడారు.ఆయన మాటల్లోనే...ఈగలోని ప్రతీషాట్ ని తెలుగు,తమిళ భాషల్లో సెరపేట్ గా చిత్రీకరించాము. నాన్ ఈ ఆనే చిత్రం తమళ డబ్బింగ్ వెర్షన్ కాదు. అది బైలిగ్వల్. ఇక హిందీలలో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాము. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర జరుపుకుంటోంది. ఈ 30న విడుదల చేస్తాము అన్నారు. 

సమంత , నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. తెలుగు వెర్షన్ కి సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే ‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ ‘ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా ‘ ఈగ' కథాంశం.