'గబ్బర్ సింగ్'పై సల్మాన్ షాకింగ్ కామెంట్

'గబ్బర్ సింగ్'పై సల్మాన్ షాకింగ్ కామెంట్

గబ్బర్ సింగ్ సినిమా కలెక్షన్స్ అంతటా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నేషనల్ మీడియా సైతం ఈ చిత్రం గురించి ఓ రేంజిలో అప్ డేట్స్ ఇస్తోంది. ఈ నేపధ్యంలో గబ్బర్ సింగ్ ఒరిజనల్ చిత్రం దబాంగ్ హీరో  సల్మాన్ ఖాన్ స్పందించారు. ఆయన ఈ కలెక్షన్స్ ని చూసి షాక్ అయ్యారు. తమిళంలో ఓస్తి పేరుతో శింబుతో చేసినా వర్కవుట్ కాని ఈ సినిమా పూర్తి మార్పులతో తెలుగులో చేయటాన్ని, అది పెద్ద హిట్టవటాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ తెలుగు హీరోల చిత్రాలు తాను రీమేక్ చేస్తూంటే.. ఇప్పుడు తన చిత్రం రీమేక్ చేసి అంత పెద్ద హిట్ కొట్టడం ఆయనికి విచిత్రంగా ఉంది.

ఈ విషయమై సల్మాన్ మాట్లాడుతూ... సౌత్ లో హీరోలను దేముడులా ఆరాధిస్తారని తెలుసు. కానీ నేను ఓ హీరోకి ఇంత ఫాలోయింగ్, ఇంత క్రేజ్ ఊహించలేదు. ఈ మానియా చూస్తూంటే, నాకూ తెలుగులో ఓ చిత్రం చేయాలనిపిస్తోంది అన్నారు. గబ్బర్ సింగ్ ఓవర్ సీస్ లో కూడా దబాంగ్ కన్నా ఎక్కువ బిజినెస్ చేస్తోందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు తరుణ్ ఆదర్స్ లాంటివాళ్లు చెప్తున్నారు. ఇక సల్మాన్ ఈ చిత్రంలోని కెవ్వు కేక పాటకు చాలా ఇంప్రెస్ అయ్యాడని, తన దబాంగ్ 2లో ఆ పాటను పెట్టే అవకాశముందని బాలీవుడ్ టాక్. 

ఇక సల్మాన్ మరదలు మలైకా అరోరా ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేసింది.  గబ్బర్ సింగ్  ఒరిజనల్ దబాంగ్ లో ఆమె చేసిన ‘మున్నీ బదనాం హుయే' పాట పెద్ద హిట్ గా మారింది. ఇక అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసి పోకుండా ఈ ఐటం సాంగు ఉంటుందని, అందుకే ఈ పాట కోసం  మలైకా అరోరా ను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ పాటకోసం చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ని చూసినా చివరకు ఆమెనే ఫైనల్ చేసారు. అలాగే రాజమౌళి సైతం కెవ్వు కేక పాటకు నిరాశ చెందినట్లు ట్వీట్ చేయటం వార్తల్లో నిలిచింది. ఈ పాట నిమిత్తం మలైకాకు కోటి రూపాయలు వరకూ పే చేసారని అప్పట్లో వినపడింది.

మలైకా మాత్రం కెవ్వు కేక పాట షూట్ జరిగినప్పడు తన అనుభవాలను మలైకా మీడియాతో పంచుకుంది. ఆమె.. పవన్ ని దేముడు అంటోంది. అతను ఎక్సట్రీమ్లీ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది. తను డాన్స్ చేయటానికి వచ్చినప్పుడు ఢిఫెరెంట్ గా ఉంటాడు అనుకన్నాను కానీ ఇంత అవుట్ స్టాండింగ్ ఫెరఫార్మెన్స్ ఇస్తాడనుకోలేదు అంది. ఇక ఈ పాట గురించి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దబాంగ్ మా సొంత ప్రొడక్షన్ చిత్రం. దాని రీమేక్ లో నేను చేసిన పాట మళ్లీ నేనే చెయ్యటం చాలా ఆనందకరమైన విషయం. నిర్మాత గణేష్ బాబు నన్ను చాలా కేర్ గా చూసుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ సెట్స్ పై చాలా కంపర్ట్ గా నన్ను ఉంచారు అంటూ మెచ్చుకొంది.