సుమంత్, వరుణ్ సందేష్ ‘ట్విస్ట్'

సుమంత్, వరుణ్ సందేష్ ‘ట్విస్ట్'

సుమంత్,  వరుణ్ సందేశ్  కాంబినేషన్లో ‘ట్విస్ట్' పేరుతో ఓ చిత్రం రూపొందబోతోంది. శశి సుడిగాల దర్శకత్వంలో మూవింగ్ ఇమేజస్ పతాకంపై ఎన్.ఎం పాషా, నాగార్జునరెడ్డి, ఆకాంక్ష ఖన్నా ఈ సినిమాని నిర్మించనున్నారు. ‘ఎస్ఎంఎస్' ఫేం రెజీనా ఇందులో కథానియక. 

జూన్ నెలలో చిత్రీకరణ మొదలు కానుంది. నిర్మాత చిత్ర విశేషాలు చెబుతూ...‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కాన్ కేపర్ జానర్‌లో ఈ సినిమా చేస్తున్నాం. బాలీవుడ్ స్టయిల్‌లో పూర్తి స్తాయి ఆధునిక హంగులతో ‘ట్విస్ట్'ని తీర్చి దిద్దబోతున్నాం. నగేష్ కుకునూర్ శిష్యుడైన శశి సుడిగాల న్యూయార్క్ ఫిలిం స్కూల్లో శిక్షణ పొందాడు. హిందీలో సుభాష్ గై సంస్థలో ‘సైకిల్ కిక్' అనే సినిమా డైరెక్ట్ చేశాడని తెలిపారు. 

ఇందులో మరో ఇద్దరు ప్రముఖ హీరోలు కూడా నటించబోతున్నారు. ఓ పాపులర్ బాలీవుడ్ సంగీత దర్శకుడు స్వరాలు అందించనున్నారు. వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాలకు కెమెరామెన్ అయిన విఎస్. జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి ఛాయా గ్రాహకుడిగా వ్యవహరించబోతున్నారు. అదే విధంగా గమ్యం, వేదం చిత్రాలకు పని చేసిన శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ చేయనున్నారు. జూన్ నెలలో ఏకధాటిగా చిత్రీకరణ మొదలు పెడతాం అని నిర్మాత చెప్పుకొచ్చారు.

సుమంత్  చివరి సారిగా...‘దగ్గరగా దూరంగా' చిత్రంలో నటించాడు. అయితే ఆచిత్రం అనుకున్న అంచనాలను అందుకోక ప్లాప్ అయింది. ఇక వరుణ్ సందేష్ చివరగా ప్రియుడు సినిమాలో నటించి ప్లాపు చవి చూశాడు. ప్రస్తుతం చమ్మక్ చల్లో చిత్రంలో నటిస్తున్నాడు