దర్శకుడికి క్షమాపణ చెప్పిన బెల్లంకొండ

దర్శకుడికి క్షమాపణ చెప్పిన బెల్లంకొండ

నిర్మాత బెల్లంకొండ సురేష్ ‘కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాసన్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో దర్శకుడు సంతోష్ శ్రీనివాసన్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దర్శకుల సంఘం నిర్మాత బెల్లంకొండపై సిరీయస్ అయింది. దర్శకులతో నిర్మాతలు మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని, దూషించడం, దాడి చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటే సదరు నిర్మాతలను బహిష్కరిస్తామని దర్శకుల సంఘం సభ్యులు హెచ్చరించారు. అవసరం అయితే అతనితో సినిమాలు చేయమనే రేంజికి వెళ్లడంతో......బెల్లంకొండ సురేష్ దిగి రాక తప్పలేదు. ఈ మేరకు వ్రాతపూర్వకమైన క్షమాపణ చెప్పారు. దీంతో వివాదం సద్దుమనిగినట్లయింది. 

బెల్లంకొండ సురేష్ కి,సంతోష్ శ్రీనివాస్ కి మధ్య వివాదం రెమ్యునేషన్ విషయంలో తలెత్తిందని,రెమ్యునేషన్ విషయంలో మాట మాట రావటంతో కోపగించిన బెల్లంకొండ సురేష్ ..వెంటనే ఆవేశంలో శ్రీనివాస్ ని కొట్టాడని తెలుస్తోంది. దర్శకుడుగా సంతోష్ శ్రీనివాస్ కి లైఫ్ ఇచ్చిన బెల్లంకొండకు రెమ్యునేషన్ విషయంలో శ్రీనివాస్ పట్టుబట్టడంతో పట్టరాని కోపం వచ్చే చెయ్య జారాడని చెప్పుకుంటున్నారు.

అయితే కొన్ని మీడియా వర్గాలు...ఇప్పుడు కొత్తగా రూపొందిస్తున్న చిత్రం స్క్రిప్టు సెకండాఫ్ లో మార్పులు చేయమని బెల్లంకొండ అడిగాడని దానికి శ్రీనివాస్ ఒప్పుకోకపోవటం ఈ వివాదానికి కారణమని తేలుస్తున్నాయి. హీరో రామ్ ఒప్పుకున్నాడు కాబట్టి మళ్లీ మళ్లీ స్క్రిప్టు మార్పులు చేయవద్దని శ్రీనివాస్ కోరడంతో వివాదం పెద్దదయిందని చెప్పుకుంటున్నారు. 

ఇక గతంలో రామ్ కి,బెల్లంకొండ సురేష్ కి మధ్య కూడా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. మొదట ఒప్పుకున్న రెమ్యునేషన్ ఎగ గొట్టాడని కందిరీగ విడుదల అయ్యాక రామ్ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసి వసూలు చేసుకున్నారు.