శివనారాయణగా దగ్గుపాటి రాణా

శివనారాయణగా దగ్గుపాటి రాణా

త్వరలో రాణా దగ్గుపాటి శివనారాయణ గా వెండి తెరను పలకరించనున్నాడు. రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'డిపార్ట్‌మెంట్'లో రాణా ఓ ఢిపెరెంట్ పాత్రను పోషిస్తున్నాడు. మొదటి చేతిలో రివాల్వర్ కి పని పెట్టి(కాల్చి) తర్వాత నోటి కి పనిపెట్టే (మాట్లాడే)పాత్రలో రాణా జీవించాడంటున్నారు. తన గౌవరించే వ్యక్తులకు ఒబీడియంట్ గా ఉండే ఈ పాత్ర రాణా కి మంచి పేరు తెచ్చి పెట్టి బాలీవుడ్ లో నిలబెట్టేది అవుతుంది అంటున్నాడు. 

చిత్రంలోని తన పాత్ర గురించి రాణా చెపుతూ..."నా రెండో హిందీ సినిమా 'డిపార్ట్‌మెంట్'లో పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాను. ఇది ఓ క్లాసిక్ పోలీస్ డ్రామా. ముంబై మాఫియా చక్రం తిప్పుతున్న రోజుల్లో దాన్ని అదుపు చేయడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక 'డిపార్ట్‌మెంట్' కథ ఇది. సంజయ్‌దత్ సీనియర్ ఆఫీసర్‌గా, నేను కొత్తగా రిక్రూట్ అయిన యువకునిగా నటించాం. అమితాబ్ బచ్చన్ ఓ రాజకీయ నాయకునిగా కనిపిస్తారు'' అని చెప్పుకొచ్చాడు. ఇక గత సంవత్సరం రాణా చేసిన తొలి హిందీ చిత్రం 'దమ్ మారో దమ్'భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. 

అలాగే తన రెండో హిందీ చిత్రం 'డిపార్ట్‌మెంట్'గ్యారెంటీగా భాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు దగ్గుపాటి రాణా. 'డిపార్ట్‌మెంట్'చిత్రం ఈ నెల 18న విడుదల అవుతున్న సందర్భంగా మీడియాత