కృష్ణవంశీ కోసం 'వైయస్ జగన్'గా నాని

కృష్ణవంశీ కోసం 'వైయస్ జగన్'గా నాని

నాని త్వరలో వై.యస్ జగన్ పాత్రలో కనపించనున్నాడని విశ్వసనీయ సమాచారం. కృష్ణవంశీ దర్సకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న పైసా చిత్రంలో జగన్ పాత్ర కనిపించుతుందని చెప్తున్నారు. ఈ చిత్రం ఓ పొలిటకల్ సెటైర్ అని,కరప్టెడ్ రాజకీయ నాయకులును చిత్రంలో ప్రస్దావిస్తున్నారని చెప్తున్నారు. అలాగే బోత్సా సత్యనారాయణ పాత్ర,లిక్కిర్ సిండికేట్ వ్యవహారం కూడా ఈ చిత్రంలో చోటు చేసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయమై నిర్మాత పుప్పాల రమేష్ ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... నాని ని వైయస్ జగన్  లాగ చూపించటం లేదు. జగన్ గానీ, బొత్సా గానీ మరొకరు ని ఈ చిత్రంలో ప్రేరణగా తీసుకుని చేయటం లేదు. అయితే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి,కొందరు అడ్డంగా డబ్బు సంపాదించి ఎదగటానికి ప్రయత్నించటం వంటివి చూపిస్తున్నాం. డబ్బుకోసం ఎంతకైనా ముందుకు వెళ్లే వారిని చూపిస్తున్నాం అన్నారు. 

ఇక చిత్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాత్రం ప్రస్తావించటం లేదు గానీ, వైయస్ జగన్ స్పూర్తితో పాత్రను అల్లుకున్నారు. ఇందులో హీరో పాత్ర డబ్బు వెనక పడుతూ అన్ని బంధాలను కాదనుకుంటాడు. షార్ట్ టైమ్ లోనే తన డబ్బుని,పవర్ ని ఉపయోగించి సి.ఎం అవుతాడని చెప్తున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే. ఎల్లోఫ్లవర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని మంచి నిర్మాణ విలువలతో నిర్మిస్తోంది. ఈ సినిమాలో కేథరీన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. గతంలో మిరపకాయ నిర్మించిన రమేష్‌ పుప్పాల నిర్మాత. 

ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృష్ణవంశీ శైలిలో కథ, కథనాలుంటాయని తెలిసింది. వరసగా కృష్ణ వంశీ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతున్నాయి. మహాత్మ, మొగుడు చిత్రాలు మార్కెట్లో మంచి హైప్ తెచ్చుకున్నా వర్కవుట్ కాలేదు. ముతక కథ,కథనం ఈ చిత్రాలుకు మైనస్ గా మారాయి. ఎలాగైనా ఈ ప్రాజెక్టుతో హిట్ కొట్టాలని కృష్ణవంశీ కసిగా చేస్తున్నట్లు చెప్తున్నారు. ఫన్ తో కలసిన సోషల్ రెలివెంట్ సబ్జెక్టు అని టాక్ వినపడుతోంది.