ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌ రడగ

ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్‌ రడగ

పుత్రరత్నంతో చిదంబరానికి తిప్పలు తప్పేలా లేవు. ఎయిర్ సెల్ -మ్యాక్సిస్ కంపెనీ నుంచి చిదంబరం ఫ్యామిలీకి లబ్ధి చేకూరిందన్న విపక్షాల ఆరోపణలతో లోక్ సభ ప్రతిధ్వనించింది. ఐతే.. తానెలాంటి తప్పు చేయలేదన్న చిదంబరం.. కావాలంటే గాడ్ ప్రామిస్ అన్నారు. అటు విపక్షాలు ఏకం కావడంతో చిద్దూకు బాసటగా బాసటగా ప్రణబ్‌ ఊగిపోయారు.

కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని టార్గెట్‌ చేసుకుని బీజేపీ లోక్‌సభలో ఎదురుదాడికి దిగింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందంలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరానికి భారీగా ముడుపులు ముట్టాయన్న బీజేపీ ఆరోపణలతో సభ దద్దరిల్లింది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ చిద్దూ తక్షణం రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో గందరగోళం నెలకొంది. ఎయిర్‌సెల్‌ -మ్యాక్సిస్ డీల్‌లో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ నేత యశ్వంత్ సిన్హా ఆరోపించారు. ఆ టెలికం కంపెనీలో కార్తీకి 5 శాతం వాటా ఉందని.. అందుకు ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం 2006 మార్చి 7న జరిగినట్టు ప్రభుత్వం చెప్తున్నా నిజానికి ఈ డీల్‌ 2006 సెప్టెంబర్‌ 3న కుదిరిందని బీజేపీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించింది. ప్రభుత్వం కావాలని సభను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. 

దీనిపై హోం మంత్రి చిదంబరం తీవ్రంగా స్పందించారు.. తనకు, తన కుటుంబీకులకు ఎయిర్‌సెల్-మాక్సిస్ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎయిర్‌సెల్-మాక్సిస్ తమకెలాంటి వాటాలు లేవని చిద్దూ వివరణ ఇచ్చారు. మాక్సిస్ వ్యవహారంలో బీజేపీ నేతల ఆరోపణలు నిరాధారమైనవని, వారిని దేవుడే చూసుకుంటాడని సెటైర్ విసిరారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తమ కుటుంబంపై బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు.