వీకెండ్ లో 24 కోట్లు వసూళ్ళ రికార్డు

వీకెండ్ లో 24 కోట్లు వసూళ్ళ రికార్డు

మహేష్ భట్ క్యాంప్ నుంచి వచ్చిన జన్నత్ 2 చిత్రం భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే వీకెండ్ లో 24 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. భయ్ త్రయం మోడ్రేట్ బడ్జెట్ లో నిర్మించిన ఈ చిత్రం డ్రామా,రొమాన్స్ ప్రధానాంశాలుగా రూపొందింది. మూడేళ్ల కిందట(2008లో) విడుదలై కమర్షియల్‌గా భారీ విజయం సాధించిన ‘జన్నత్' సినిమాకు సీక్వెల్ కావటం ప్లస్ అయ్యిందని,అదే కలెక్షన్స్ ని తెచ్చిపెట్టిందని,సినిమా టాక్ బయిటకు స్ప్రెడ్ అయ్యేలోగ కలెక్షన్స్ వచ్చేసాయని చెప్తున్నారు. తమ అతి తక్కువ బడ్జెట్ కి ఇది పెద్ద రికార్డే అని భట్ కంపెనీ అంటోంది.

‘జన్నత్'లో ఇమ్రాన్‌హష్మీకి సోనాల్ చౌహాన్ జోడీ కట్టగా ‘జన్నత్-2'కి ఇషాగుప్తా అదరకొట్టింది. మొదటి జన్నత్‌లో అర్జున్‌దీక్షిత్ పాత్రలో చిన్న దోపిడీలు మాత్రమే చేసిన హీరో ఉంటే....ఈ సీక్వెల్ లో రాత్రికిరాత్రే సంపన్నుడవ్వాలనుకుంటాడు. అక్రమ ఆయు ధ వ్యాపారం మొదలు పెడతాడు. నిజానికి ఈ సీక్వెల్‌కి తొలుత ‘ఇన్ఫార్మర్' పేరు పెట్టాలనుకున్నారు. కానీ కథనం రీత్యా ఇది జన్నత్‌ను పోలి ఉండటంతో ‘జన్నత్-2' టైటిల్‌ను ఖరారుచేసి వదిలారు. అదే ఈ రోజు సినిమా ఊహించని కలెక్షన్స్ కు ఆధారమైంది. 

ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర ఏసీపీ ప్రతాప్ రఘువంశీ గా రణదీప్ హుడా చేసారు. రఫిక్ అందించిన కథను ఆసక్తికరమైన సినిమాగా మలిచాడు డెరైక్టర్ కునాల్ దేశ్‌ముఖ్. అయితే సెకండాఫ్ లోనే బోర్ కొట్టేస్తుంది. అలాగే ఇమ్రాన్ హష్మీ సినిమా అనగానే సంగీతం విషయంలో అంచనాలు ఉంటాయి. ఈ సినిమా సంగీతం కూడా నిరాశ పరచదు. సూఫీ మ్యూజిక్‌లోని ఎలిమెంట్స్‌తో సంగీత దర్శకుడు ప్రీతమ్ అందించిన ‘తుహి మేరా' పాట సూపర్ హిట్ అయ్యింది. 

ఇక ఇందులో ఇమ్రాన్‌హాష్మి... సోనూ ఢిల్లీ అనే చిల్లర ఆయుధాల స్మగ్లర్ గా కనిపిస్తాడు. పోలీసు అధికారి ప్రతాప్ (రణదీప్ హుడా) చేతికి చిక్కిన అతను ఇన్ఫార్మర్ గా మారతాడు. అక్కడ నుంచి తన తన ముఠాలోని మెంబర్స్ నే పట్టింస్తూంటాడు. చివరకు తన బాస్ మంగళ్‌సింగ్ తోమర్ (మనీష్ చౌదరి)ని పట్టిద్దామనుకుంటే అతనికో ట్విస్ట్ పడుతుంది. మంగళ్ సింగ్ మరెవరో కాదు..తను ప్రేమించి,పెళ్లి చేసుకున్న డాక్టర్ జాహ్నవి..తండ్రి. అటు ఇన్ఫార్మర్ గా కొనసాగాలా లేక తన కుటుంబమే ముఖ్యమనుకోవాలా అనే డైలమాలో నడిచే పాత్ర ఇది.