నా ఇల్లు ఏమైనా నక్షత్ర హోటలా

నా ఇల్లు ఏమైనా నక్షత్ర హోటలా

నేనేమైనా స్టార్ హోటల్ నడుపుతున్నానా.? నా ఇంటిలో 74 గదులు ఉన్నాయంటూ ప్రచారం చేయడానికి అంటూ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన సాగిస్తున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నా ఇంట్లో 74 గదులు ఉండటానికి నేనేమైనా హోటల్ నడుపుతున్నానా అంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జగన్ నివాసంలో 70 గదులు ఉన్నాయంటూ కిరణ్, చంద్రబాబు నాయుడులు ప్రచారం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇంటిని ఎవరైనా అలా కట్టుకుంటారా అని ప్రశ్నించారు. తాను స్టార్ హోటల్ ఏమైనా నడుపుతున్నానా అని ప్రశ్నించారు. 

అంతేకాకుండా కిరణ్, చంద్రబాబులు కుమ్మక్కై తన కులం, మతం, వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఇద్దరికీ తాను ఒకటే చెబుతున్నానని, తన మతం మానవత్వమని, పేదవాడి కోసం తపించే, తాపత్రయపడే కులమే నా కులమని జగన్ స్పష్టం చేశారు. ఎంత సేపటికి నా గురించి, నా ఆస్తుల గురించి, నా కులం, గోత్రం గురించి మాట్లాడటమే కానీ, పేద ప్రజలకు ఏం చేయనున్నారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.