జగపతి బాబును వదిలేసిన ప్రియమణి

జగపతి బాబును వదిలేసిన ప్రియమణి

కొంతకాలం పాటు తన గ్లామర్‌తో తమిళనాడు, తెలుగునాట యూత్‌ను క్రేజ్‌ తెప్పించిన ప్రియమణి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఒకప్పుడు జగపతిబాబు ఆమెను రికమండ్ చేసేవాడు. క్షేత్రం సినిమాలో ఆమె అందాన్ని చూసి ఆపుకోలేకపోతున్నానంటూ పబ్లిక్‌గానే కామెంట్‌ చేశాడు. అదే షూటింగ్‌లో ఉండగా... పెళ్ళాం కంటే బాగా చూసుకునేవాడని యూనిట్‌ చెప్పేది. 

పెళ్లయిన కొత్తలో సినిమాతో ఏర్పడిన పరిచయం.. చాలాకాలంపాటు సాగింది. చాలా సినిమాలకు రికమండ్ చేశాడు. ఇప్పుడు ఆయనకే సరిగ్గా సినిమాలు లేవు. దీంతో జగపతిబాబును వదిలి మరో హీరోను పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉందట ప్రియమణి. 

తమిళ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు అవార్డును పొందిన ప్రియమణి ఇప్పుడు అవకాశాల కోసం టాలీవుడ్‌ దర్శకుల చుట్టూ తిరుగుతోంది. త్వరలో మళ్ళీ తెలుగులోకి రావాలనే కసితో ఉంది. మరి జగపతిబాబు ఏమంటాడో చూడాలి.