యడ్యూరప్పకు కష్టాలు

యడ్యూరప్పకు కష్టాలు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మళ్లీ కష్టాల్లో పడ్డారు. అక్రమ మైనింగ్, భూముల కేటాయింపు కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమ భూదందాపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను పూర్తి చేసి ఆగస్టు 6 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రాచేనహళ్లి డీ నోటిఫేకేషన్ లో అక్రమాలు, సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీ నుంచి ప్రేరణ ఎడ్యుకేషనల్ సొసైటీకి 10 కోట్ల రూపాయల మళ్లింపు తదితర ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.మరోవైపు.. ఈ తీర్పుతో యడ్యూరప్ప అప్రమత్తమయ్యారు. తన ప్రధాన అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.