నిత్యానందకు మద్రాస్‌ హైకోర్ట్‌ ఝలక్

నిత్యానందకు మద్రాస్‌ హైకోర్ట్‌ ఝలక్

మధురై ఆధీనం పీఠాధిపతిగా నియమితులైన నిత్యానందకు మద్రాస్‌ హైకోర్ట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. మధురైలోని అధీనం పీఠాధిపతిగా ఆయన నియామకంపై న్యాయస్థానం స్టే విధించింది. నిత్యానంద నియామకాన్ని మరికొందరు పీఠాధిపతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పదవి నుంచి దిగిపోవాలని గతంలోనే హెచ్చరించారు. నిత్యానంద నుంచి స్పందన రాకపోవడంతో.. హైకోర్టును ఆశ్రయించారు. అశ్లీల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆధ్యాత్మిక పదవుల్లో నియమించడంపట్ల భక్తుల్లో నమ్మకాలు సన్నగిల్లుతాయని గౌతం అనే న్యాయవాది చెన్నై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.