లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి

ముందస్తు లోక్‌సభ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ కార్యకర్తలకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఆ పార్టీ అంతర్గత సమావేశం శుక్రవారం కోల్‌కతాలో జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. తన వద్ద ఉన్న సమాచారం మేరకు లోక్‌సభకు 2013లోనే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు అందుతున్నాయన్నారు. 

అందువల్ల ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ఎపుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే, తనకు అందించిన సమాచారం కరెక్టు కూడా కాకపోవచ్చని ఆమె పార్టీ సమావేశంలో చెప్పుకొచ్చారు. కేవలం సమాచారం మాత్రమే పొందాను. దీనికి సంబంధించిన మరింత లోతుగా నేనే వెళ్లలేదని చెప్పుకొచ్చారు.