ఇండియా చరిత్రలో బిల్లా-2 రికార్డు

ఇండియా చరిత్రలో బిల్లా-2 రికార్డు

అజిత్ హీరోగా అప్పట్లో వచ్చిన తమిళ చిత్రం ‘బిల్లా'చిత్రం భారీ విజయం సాధించిన నేపపథ్యంలో.....తాజాగా ‘బిల్లా 2' చిత్రం కూడా రూపొందుతోంది. సాధారణంగా తొలుత ఒక సినిమా వచ్చిందంటే దానికి కొనసాగింపు స్టోరీగా సీక్వెల్ రూపొందిస్తుంటారు. కానీ బిల్లా-2 చిత్రం బిల్లా చిత్రానికి ప్రీక్వెల్. అంటే ముందు జరిగిన కథ. మనకు ఇప్పటికే ‘బిల్లా' చిత్రం ద్వారా తర్వాతి కథను చూపించారు.

తాజాగా బిల్లా 2లో బిల్లా మాఫియా లీడర్ అవ్వకముందు ఏం చేసేవాడు? అతను మాఫియాలోకి ఎంటరవ్వడానికి కారణం ఏంటి? అసలు బిల్లాగా అతను ఎలా రూపొందాడు. అంత పెద్ద డాన్‌గా ఎలా మారి ప్రపంచానికి సవాళ్లు విసిరాడు...వంటి అనేక విషయాలు ఈ చిత్రంలో చూపించనున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే బిల్లా 2 చిత్రం తొలి ప్రీక్వెల్ చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఈ చిత్రాన్ని తెలుగులో ‘డేవిడ్ బిల్లా'గా విడుదల చేస్తున్నారు. తెలుగు విడుదల హక్కులను ఎస్వీఆర్ మీడియా అధినేత శోభారాణి చేజిక్కించుకున్నారు. ఈ సినిమా గురించి శోభారాణి చెబుతూ ...అజిత్ కెరియర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఇది.

చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో...పార్వతి ఓమన కుట్టన్, బ్రూనా అబ్దుల్లా ఈ చిత్రంలో లీడ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మీనాక్షి దీక్షిత్, గాబ్రియేలా బెర్జాంటె ఈచిత్రంలో ఐటం సాంగుల్లో నర్తిస్తున్నారు.