ఒబామా సెల్ నంబర్ 9177523297 !

ఒబామా సెల్ నంబర్ 9177523297 !

నల్లగొండలో అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా సెల్ నంబర్ తీసుకున్నాడు. అవును ఇది నిజం. మన దేశంలో సిమ్ కార్డుల జారీ ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా మారిందో ఈ సంఘటన మరో సారి నిరూపించింది. 
నల్లగొండకు చెందిన ప్రసాద్ తన ఫొటోకు బదులుగా... అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫొటో పెట్టి ఎయిర్ టెల్  కంపెనీకి చెందిన 9177523297 నెంబరుకు ఆక్టివేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తన వయసు 21 ఏళ్లుగా రాశాడు. ఇవవీ పట్టించుకోని సంబంధిత వ్యక్తులు ప్రసాద్ కు సిమ్ ఆక్టివేట్ చేశారు. అయితే ఈ విషయం ఆనోటా ఈనోటా బయటపడి చివరకు ఎస్పీ నవీన్ గులాటి దగ్గరకు చేరింది. ఆయన వెంటనే టెలికాం అథారిటి ఆఫ్ ఇండియా(ట్రాయ్)కి సమాచారం అందించారు. దీంతో ఆనెంబర్ ను వెంటనే డీఆక్టివేట్ చేశారు.