హరీష్ శంకర్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్వకత్వంలో ఓ హిల్లోరియస్ సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం ఖరారైంది. హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
ఇటీవలే ఈచిత్రానికి సంబంధించి కథ, స్క్రిప్టును దర్శకుడు హరీష్ శంకర్ జూ ఎన్టీఆర్‌కు వినిపించాడు. జూనియర్ ఎన్టీఆర్ అది విన్నవెంటనే ఎంతో ఎగ్జైట్ అయి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి స్క్రీప్లే వర్క్ మొదలైంది. సెప్టెంబర్ వరకు ఈచిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో సాగుతుందని, దీనికి ఎంఎల్ఏ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్
ఎన్టీఆర్
సన్నిహితుడు, గుడివాడ ఎంఎల్ఏ కొడాలి నాని వైష్ణవి ఆర్ట్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం జూనియర్ బాద్ షా' షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఈచిత్రం పూర్తయిన తర్వాత హరీష్ శంకర్ తో చిత్రం మొదలు పెట్టనున్నాడు యంగ్ టైగర్.
ఇక పోతే...
హరీష్ శంకర్
దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్' చిత్రం ఈ రోజు విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత పవర్ స్టార్ కెరీర్లో అతిపెద్ద హిట్ సినిమా వచ్చి చేరడంతో అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు.