'విలన్'గా రీఎంట్రీ ఇవ్వనున్న రాశి

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా పలు సినిమా చేసిన నటి రాశి. మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. వెండి తెరకు దూరమై ఆరేళ్లు అయింది. పెళ్లిచేసుకుని సినిమాకు దూరమైనా రాశి మళ్ళీ తెరపై కన్పిస్తే బాగుంటుందని భావించే వారు లేకపోలేదు.
అలాగే, రాశి కూడా రీ ఎంట్రీ కోసం పరితపిస్తోంది. ఇందులోభాగంగా ఇటీవల తమిళ చిత్రంలో కమిట్ అయింది. ప్రముఖ హీరో నటిస్తున్న ఈ సినిమాలో విలన్‌గా నటిస్తోందట. పాత్రలో కూడా మంచి ఎక్స్పోజింగ్ కూడా ఉందట.
తెలుగులో కూడా ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న రాశి.. వాటి నుంచి బయటపడేందుకే రెండో ఇన్నింగ్స్‌ను పక్కా ప్రణాళితో అరంగేట్రం చేస్తున్నట్టు సమాచారం.