హీరో-దర్శకుడికి లొంగి పోవాల్సిందే : శ్రియ

 హీరో-దర్శకుడికి లొంగి పోవాల్సిందే : శ్రియ

ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా.. అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లో అవకాశాలు రావాలంటే హీరో దర్శకుడికి లొంగి పోవాల్సిందేనని ప్రముఖ నటి శ్రియ చెపుతోంది. లేకుంటే చిత్ర పరిశ్రమలో మనుగడ కొనసాగించలేమని ఆమె వాపోతోంది. 

తెలుగు, తమిళ భాషల్లో చిరంజీవి, రజనీకాంత్, నాగార్జున వంటి అగ్రహీలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మకు ఈ మధ్య కాలంలో అవకాశాలు లేకపోవడంతో కెరీర్‌కు స్వస్తి చెప్పి తనకు నచ్చిన.. తాను మెచ్చిన యువకుడిని వివాహం చేసుకుని స్థిరపడిపోవాలని భావిస్తోంది. 

తన చిత్ర పరిశ్రమ అవకాశాలపై శ్రియ మాట్లాడుతూ... అయితే తాజాగా మరో హీరోయిన్ శ్రేయ కూడా ఇలాంటి మాటే చెబుతుంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక కొంత మందికి లొంగక తప్పదంటోంది. పరిశ్రమలోకి వచ్చాక తప్పనిసరిగా ఇద్దరికి లొంగాల్సిందేనని వారిద్దరిలో మొదటి వారు హీరో అయితే, రెండో వ్యక్తి దర్శకుడని, వీరికి లొంగి పనిచేయాల్సిందే అని ధైర్యంగా చెపుతోంది. 

మామూలుగానైతే ఫస్ట్ దర్శకుడికే లొంగాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిజానికి చాలా ప్రాముఖ్యత ఉండటంతో ఫస్ట్ అతనికే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుందని అంటోంది. తన తాజా చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్' చిత్రంలో నటిస్తున్నట్టు.. ఇందులో నటీనటులంతా కొత్తవారు అయినప్పటికీ.. తాను మాత్రం కేవలం ఈ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రతిభకు మాత్రమే లొంగి పనిచేసినట్టు చెప్పారు. 

నిజానికి ఇదే తరహా అభిప్రాయాన్ని పోర్న్ స్టార్ సన్నీ లియోన్ బాహాటంగానే వ్యక్త పరిచిన విషయం తెల్సిందే. చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావాలన్నా, అగ్రస్థానానికి ఎదగాలన్నా సినిమా హీరోయిన్లు "పక్క సుఖం" పంచాల్సిందేనంటూ సన్నీ లియోన్ చెప్పిన విషయం తెల్సిందే. తాజాగా శ్రియ కూడా ఈ కోవలోకి చేరడం గమనార్హం.