25 వరకూ తారా చౌదరి రిమాండ్

25 వరకూ తారా చౌదరి రిమాండ్

తారా చౌదరి రిమాండ్ ఈ నెల 25 వరకూ పొడిగించారు. ఆమె అనుచరులు ప్రసాద్, హనీఫ్‌ల రిమాండ్ కూడా 25 వరకూ పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళ కోర్టులో విచారణ సందర్భంగా.. తారా చౌదరి తన అనుచరులైన ప్రసాద్, హనీఫ్‌లపై నిప్పులు చెరిగింది డబ్బులు తీసుకుని నన్నే మోసం చేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. బెయిల్ రాగానే ఈ కుట్ర వెనుక ఉన్న వారి బండారం బయటపెడతానంది. మీడియా రక్షణ కల్పిస్తే.. బంజారాహిల్స్ సీఐ సుదర్శన్‌రెడ్డి, ఏసీపీ శంకర్‌ రెడ్డిల అక్రమాలు ఆధారాలతో సహా చూపిస్తానంది. అటు, హనీఫ్‌, ప్రసాద్‌లు పోలీసులు తమ వద్ద బలవంతంగా స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.