Flop streak of Ravi Teja is affecting the business

రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ రూపొందిన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రం మార్కెట్ అంతంత మాత్రంగానే ఉందని సమాచారం. వరసగా దొంగల ముఠా', వీర', నిప్పు' మరియు దురువు' చిత్రాలు భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోవటంతో ఆ ఎఫెక్టు ఈ చిత్రంపై పడిందని తెలుస్తోంది. బయ్యర్లు ఈ చిత్రం కొనుగోలు చేయటానకి పెద్దగా ఆసక్తి చూపటం లేదని ట్రేడ్ వర్గాలలో వినపిస్తోంది. పూరీ జగన్నాధ్ వంటి స్టార్ డైరక్టర్ దర్శకత్వం వహించినా ఈ పరిస్ధితి కనపడుతోందని ఆశ్చర్యపడుతున్నారు.
ఇక ఈ చిత్రం కాన్సెప్టు గురించి పూరీ జగన్నాధ్ చెపుతూ... దేవుడు ఎంతో మంచివాడు. అందుకే చేతులెత్తి దణ్నంపెడుతున్నాం. మరి ఆ దేవుడు చేసిన మన మనుషుల్లో మంచివాళ్లు ఎంతమంది? కర్త, కర్మ, క్రియ... అన్నీ మనమే అయినా ఆ పైవాడిపైనే భారం మోపుతూ ఎలాంటి పనులు చేస్తున్నాం? దేవుడే చేసిన ఓ యువకుడు సమాజానికి ఏం చెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంన్నారు.
అలాగే... దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా చూడండి అనే కార్డ్ వచ్చిన తర్వాత సినిమా స్టార్ అవుతుంది. హండ్రెడ్ పర్శంట్ ఎంటర్టైనర్ ఇది. నాకు రవితేజ కాంబినేషన్ లో చాలా మంచి హిట్ సినిమా అవుతుంది అన్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 22న పాటల్ని విడుదల చేస్తారు.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు. ఫొటో గ్రఫి.. శ్యామ్ కె నాయుడు, సంగీతం ..రఘు కుంచే, పాటలు.. భాస్కర భట్ల, ఎడిటింగ్.. ఎస్ ఆర్ శేఖర్. కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్సకత్వం... పూరీ జగన్నాధ్.