డాన్స్ మాస్టర్ గా మారిన పవన్ హీరోయిన్

డాన్స్ మాస్టర్ గా మారిన పవన్ హీరోయిన్

ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం 'పంజా'. సారాజేన్ డయాస్, అంజలీ లవానియా హీరోయిన్స్. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇందులో హీరోయిన్ గా చేసిన  సారాజేన్ డయాస్ మాత్రం డాన్స్ మాస్టర్ గా మారింది. ఆమె ‘క్యా సూపర్ కూల్ హై హమ్' అనే చిత్రానికి కొరియోగ్రఫీ అందిస్తోంది. మొదటి ఓ ప్రఫెషనల్ డాన్స్ మాస్టర్ ని తీసుకుందామనుకున్నా..ఆమె వారించి తనకు మొదటి నుంచి డాన్స్ ప్రాక్టీస్ అలవాటు ఉందని తానే కొరియోగ్రఫీ చేసుకుంటోంది. నైట్ పార్టీ నేపధ్యంలో సాగే పాటకు ఈమె కొరియోగ్రఫీ అందిస్తోంది.

ఏక్తాకపూర్ నిర్మించిన ఈ చిత్రం ‘క్యా సూపర్ కూల్ హై హమ్'లో తుషార్‌కపూర్, రితేష్‌దేశ్‌ముఖ్, నేహాశర్మ, సారాజైన్ డయాస్ నటిస్తున్నారు. సచిన్ యార్డి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమా ఆగస్టు2న విడుదల కానుంది. ఈ సందర్బంగా బాలాజీ మోషన్ పిక్చర్స్ ప్రతినిధి తనూజ్ గార్గ్ మాట్లాడుతూ ‘సెక్సీ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా దేశవ్యాప్త పంపిణీ హక్కులని 21 కోట్ల 60లక్షల భారీ మొత్తం చెల్లించి నాగ్‌పూర్‌కు చెందిన పంపినీదారుడు సొంతం చేసుకున్నారు. ‘క్యా కూల్ హై హమ్'కు సీక్వెల్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులని తొలి భాగం కన్నా మరింత ఎంటర్‌టైన్ చేస్తుంది' అన్నారు.

మెగా కౌంపౌడ్ లోంచి వచ్చిన నేహా శర్మ, సారా జేన్ డియాస్ లు ప్రస్తుతం ఓ సెక్స్ కామెడీ చేస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో అవకాశాలు సంపాదించుకోలక మిగిలిపోయిన ఈ ముద్దు గుమ్మలు హిందీలో క్యా సూపర్ కూల్ హై హమ్ అనే చిత్రం చేస్తున్నారు. చిరుత చిత్రంలో రామ్ చరణ్ సరసన నేహా శర్మ పరిచయమైంది. అలాగే సారా జేన్ డియాన్..పవన్ కళ్యాణ్ సరసన పంజా చిత్రంలో చేసింది. అయితే వీళ్లిద్దరూ తెలుగులో ఆ తర్వాత ఆఫర్స్ సంపాదించుకోలేకపోయారు.

నేహాశర్మ తర్వాత కుర్రాడు చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన చేసినా ఆమెకు గుర్తింపు రాలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ కావటంతో ఇక్కడ ఆెకు అవకాశాలు రాలేదు. పంజా పెద్ద డిజాస్టర్ కావటంతో సారాకు సైతం అస్సలు ఎవరికీ గుర్తు లేకుండాపోయింది. ఇక ఈ హిందీ చిత్రం ఓ సెక్స్ కామిడీ. గతంలో వచ్చిన క్యా కూల్ హై హమ్ చిత్రానికి సీక్వెల్. తుషార్ కపూర్,రితీష్ దేశముఖ్ కలిసి నటించిన ఆ చిత్రం మంచి హిట్ ని సాధించింది.