‘దరువు'రీమేక్ రైట్స్ కి భారీ డిమాండ్

‘దరువు'రీమేక్ రైట్స్ కి భారీ డిమాండ్

రవితేజ, తాప్సీ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మించిన చిత్రం ‘దరువు'. సౌండ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ తో రూపొంది రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు శివ మాత్రం తమ చిత్రం భాక్సాఫీస్ వద్ద రికార్జు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం హిందీ నుంచి,తమిళ్ నుంచి నిర్మాతలు పోటీ పోటి మరీ ఫోన్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు.

దర్శకుడు శివ రీసెంట్ గా తమిళ మీడియాతో మాట్లాడుతూ..నా చిత్రం దరువు తెలుగులో విడుదలై రాకింగ్ కలెక్షన్స్ తో భాక్సాపీస్ ని మెప్పిస్తోంది. ఈ చిత్రం రీమేక్ చేయమని అడుగుతూ..నాకు చెన్నై,ముంబై నుంచి కాల్స్ వస్తున్నాయి. అయితే నేనే ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు అన్నారు. అలాగే రవితేజ పాత్రకు అక్షయ్ కుమార్ చేస్తే బావుంటుంది అంటున్నారు అని కూడా చెప్పారు. 

అయితే తమిళంలో మాత్రం తాను అజిత్ తో చేయబోయే చిత్రం మాత్రం దురువు రీమేక్ కాదు అని తేల్చి చెప్పారు. ఆయమ మాట్లాడుతూ..ఎలా ఇలాంటి రూమర్స్ స్టార్ట్ అవుతాయో అర్దం కావటం లేదు. నేను ఎక్కడా దరువు రీమేక్ ని అజిత్ తో చేస్తున్నాను అని చెప్పలేదు. అజిత్ తో నేను చేయబోయే సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్,కొత్త స్క్రిప్టు అది..త్వరలోనే దానికి సంభందించిన ప్రకటన వస్తుంది అన్నారు. అలాగే ఆ చిత్రం విష్ణు వర్ధన్ తో అజిత్ చేయబోయే చిత్రం తర్వాత ప్రారంభం అవుతుంది అన్నారు. 

దరువులో  బ్రహ్మానందం, సాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అవినాష్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: శివ, ఆదినారాయణ, సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: వెట్రివేల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: నాగమునీశ్వరి.