జులాయి'ఆడియోకి చిరు నో ఎందుకంటే.

జులాయి'ఆడియోకి చిరు నో ఎందుకంటే.

అల్లు అర్జున్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘జులాయి'. ఈ చిత్రం ఆడియో ఈ రోజు జరుగుతోంది. ఈ ఆడియోకు చిరంజీవి రావటం లేదు. అయితే దానికి కారణం నిర్మాత మీడియాకు వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ కార్యక్రమానికి పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్ హాజరుకానున్నారని, ఎన్నికల ప్రచారంలో ఉన్నందున చిరంజీవి హాజరుకావడంలేదని, ఈ సందర్భంగా అభిమానులందర్నీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ...‘‘త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం ఓ అందమైన అనుభవం. అలాగే మళ్లీ నా సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ ఇవ్వడం, ఇలియానాతో తొలిసారి నటించడం ఆనందంగా ఉంది. రాజేంద్రప్రసాద్‌గారితో తొలిసారి నటిస్తున్నాను. ఆయన డైలాగ్ టైమింగ్ సూపర్బ్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో డైలాగ్స్‌కి విజిల్స్ పడతాయి'' అని అన్నారు.

‘జులాయి' స్టోరీలైన్ విషయానికి వస్తే...పని, పాట లేకుండా తిరిగేవాడ్ని పెద్దలు ‘జులాయి' అంటుంటారు. ఆ పెద్దలే... మగాడు తిరక్క చెడతాడు... ఆడది తిరిగి చెడుతుంది అని సూక్తులు వల్లిస్తుంటారు. వీటిల్లో ఏది కరెక్ట్? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం చాలాకష్టం. అందుకే ఆ పెద్దల తిట్లను కూడా ఆశీర్వాదాలుగా తీసుకుంటుంటాడు ఓ కుర్రాడు. వాళ్లు ‘వెధవ' అన్నా... ‘వెయ్యేళ్లు ధనముతో వర్థిల్లు' అని దీవించినంత ఆనందపడిపోతాడు. అలాంటి కుర్రాడికి ఓ కుర్రది తారసపడితే... ఇక ఆ సందడికి హద్దు ఉంటుందా... అల్లు అర్జున్ ‘జులాయి' సినిమా నడక ఇలాగే ఉంటుంది .


అల్లు అర్జున్, ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'జులాయి' చిత్రం ఆడియో వేడుక ఆదివారం సాయంత్రం జరుగనుంది. ఈ కార్యక్రమానికి పవన్‌కళ్యాణ్, రాంచరణ్ ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య సమర్పకుడు.


సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: ఎస్.రాధాకృష్ణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.