సునీల్ తో హీరోయిన్స్ కి అదే భయం

సునీల్ తో హీరోయిన్స్ కి అదే భయం

కమిడెయిన్ గా ప్రవేశించి హీరోగా లాంచ్ అయ్యి, సిక్స్ ప్యాక్ తో తిరుగులేదనిపించుకున్న స్టార్ సునీల్. అయితే అతనికి హీరోయిన్స్ కొరత విపరీతంగా ఉంది. అతని ప్రక్కన పెద్ద హీరోయిన్స్ ఎవరూ చేయటానికి ఆసక్తి చూపటం లేదు. దాంతో సునీల్ తో సినిమా అంటే బిజినెస్ బాగున్నా, హీరోయిన్స్ తో సమస్య వచ్చేయటం దర్శక,నిర్మాతలను భయపెడుతోంది. ఆ క్రమంలో సునీల్ కి చిన్న హీరోయిన్స్ ని కట్టబెడుతున్నారు. ఆ క్రమంలో వారు అనుకున్న క్రేజ్ ని ప్రాజెక్టుకి తేలేకపోతున్నారు.

సునీల్ కి హీరోయిన్స్ ఎందుకు దొరకటం లేదనేదానకి ఇండస్ట్రీలో వినపడుతున్నది ఒకే ఒకే సమాధానం. అది సునీల్ సరసన చేస్తే పెద్ద హీరోలు తన ప్రక్కన చేయనివ్వరని పెద్ద హీరోయిన్స్ భయపడటమే కారణం. గతంలో తమిళంలో వడివేలు సరసన చేసిన శ్రియకు తర్వాత అక్కడ అవకాశాలు కరవయ్యిపోయాయి. దాంతో సునీల్ మొదటి నుంచి ఫేడవుట్ అయిన హీరోయిన్స్ లేదా క్రేజ్ లేని హీరోయిన్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. 

అందాలరాముడు చిత్రంలో అప్పటికే పూర్తి స్ధాయిలో ఫేడవుట్ అయిన ఆర్తి అగర్వాల్ నటించింది. ఆ తర్వాత వచ్చిన అప్పలరాజు లో సునీల్ తో ఆడిపాడే హీరోయిన్ లేనే లేదు. కలర్స్ స్వాతి ఉన్నా వారిద్దరి మధ్యనా రొమాన్స్ లేదు. ఇక ఆ ప్లాప్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన పూల రంగడులో సునీల్ కి ఇషా ఛావ్లా పెయిర్ గా చేసింది. ప్రేమే కావాలి చిత్రంతో పరియమైన ఆమెకు ఆ తర్వాత ఆఫర్స్ రాలేదు. దాంతో సునీల్ ప్రక్కన చేసింది.

పూల రంగడు తర్వాత చేస్తున్న తను వెడ్స్ మను చిత్రం కోసం సునీల్ సరసన త్రిష ను తీసుకుందామని చాలా ట్రే చేసారు. కానీ త్రిష ఒఫ్పుకోలేదు. దాంతో మళ్లీ ఇషా ఛావ్లానే తీసుకోవాల్సి వచ్చింది. ఉదయ్ శంకర్,సునీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తున్నారు. సునీల్,నాగచైతన్యతో ప్లాన్ చేస్తున్న వెట్టై రీమేక్ లో కూడా సునీల్ సరసన హీరోయిన్ గా పెద్దగా పేరు లేని అక్షను ఫైనలైజ్ చేసారు. 

సునీల్ హీరోగా ఉదయ్ శంకర్ దర్సకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి.పతాకంపై రూపొందతున్న చిత్రానికి సంబరాల రాంబాబు అనే టైటిల్ ని పెట్టారు. డి.సురేష్‌బాబు నిర్మాత. డి.రామానాయుడు సమర్పకులు. చిత్రం కథ: కవి కాళిదాస్‌, మాటలు: శ్రీధర్‌ సీపాన, ఆర్ట్‌: వివేక్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: శేఖర్‌ వి.జోసెఫ్‌, సంగీతం: మణిశర్మ