ఎమ్మెల్యే ఆనం విచిత్ర ప్రవర్తన!

 ఎమ్మెల్యే ఆనం విచిత్ర ప్రవర్తన!

 తాను ఎమ్ముల్యే అనే విషయాన్ని మరిచి పోయి అప్పుడప్పుడూ విచిత్రంగా, ఒక్కోసారి అందరూ నవ్వుకునేలా... కొన్ని సందర్భాల్లో అంతా చీదరించుకునేలా ప్రవర్తిస్తుంటారు.

అమ్మాయిలు కనిపిస్తే వాళ్ల జడపూలు వాసన చూడటం, చుట్టూ ఉండే వాళ్లు ఇబ్బంది పడతారు, చట్ట విరుద్ధం అనే కామన్ సెన్స్ కూడా లేకుండా పబ్లిగ్గా పొగతాడం లాంటి పనులు చేసే ఆనం.... తాజాగా మరోసారి తన విచిత్రమైన ప్రవర్తన ప్రదర్శించారు. నెల్లూరులో శనివారం జరిగిన ఓ నగలషాపు ఓపెనింగుకు హాజరైన ఆనం వివేకానందరెడ్డి.... అదే కార్యక్రమానికి హాజరైన నిత్యా మీనన్‌తో అందరూ ఆశ్చర్య పడేలా ప్రవర్తించారు.

నిత్యా మీనన్ అనుమతి లేకుండా ఆమె మెడలోని నగలను సవరించారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని నిత్యా మీనన్... ఏమీ చేయలేక మిన్నకుండి పోయింది. నిత్యా మీనన్ స్థానంలో మరెవరైనా షార్ప్ లేడీ ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఏది ఏమైనా ఒక ఎమ్మెల్యే అయి ఉండి అలా ప్రవర్తించడం సరికాదని కొందరు అంటుంటే... ఆయన చేసిన దాంట్లో తప్పేముందని ఆనం సపోర్టర్లు అంటున్నారు