దిల్ రాజు కామెంట్స్ మహేష్ కు ఎఫెక్టా?

దిల్ రాజు కామెంట్స్ మహేష్ కు ఎఫెక్టా?

కొన్ని సినిమాల కలెక్షన్లు మాత్రమే నిజాయితీగా, ట్రాన్ఫరెంట్‌గా ఉంటున్నాయని....మిగతావన్నీ ఫేక్ రికార్డులే అని....ఒక స్టార్ హీరోతో సినిమా చేయాలంటే రూ. 40 కోట్లు అవసరం అవుతాయి. సినిమా సరిగా ఆడక పోతే నష్టాలు తప్పవు. లాభాలు వచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి, సినిమా నిర్మాణ వ్యయం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని  ప్రముఖ నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అయితే దిల్ రాజు వ్యాఖ్యలు మహేష్ బాబు ఆయన బ్యానర్లో నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'పై ప్రభావం చూపుతాయనే వాదన వినిపిస్తోంది. లాభాలు రావడం లేదని దిల్ రాజు చెప్పడం బాగోలేదని, ఆయన వ్యాఖ్యలు మహేష్ బాబు సినిమాపై ప్రభావం చూపి బయ్యర్లు సినిమాను కొనడానికి ముందు వెనకా ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు.

విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కొత్త బంగారు లోకం ఫేమ్ అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జే.మేయర్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌