పాలనపై కిరణ్ దృష్టి

పాలనపై కిరణ్ దృష్టి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనను గాడిలో పెట్టాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే ఆయన ఐఎఎస్ అధికారులను బదిలీకి శ్రీకారం చుట్టారు. తాజాగా గురువారం 11 మంది ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి అందులో కొంతమంది కలెక్టర్లగానూ, మరికొంతమంది కమిషనర్లగానూ నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

బదిలీ చేసిన ముగ్గురు ఐఎఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. వారిని నిరీక్షణలో పెట్టారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని, గుంటూరు జిల్లా కలెక్టర్ విష్ణు, కర్నూలు జిల్లా కలెక్టర్ రామశంకర్ నాయక్‌లను బదిలీ చేసి నిరీక్షణలో ఉంచింది. గురువారం ఉదయం న్యూఢిల్లీకి బయలుదేరే ముందు ముఖ్యమంత్రి ఐఎఎస్ అధికారుల బదిలీ ఫైలుపై సంతకం చేశారు. ఐఎఎస్ అధికారులు పొందిన కొత్త పోస్టులు ఈ విధంగా ఉన్నాయి.

సౌరబ్‌గౌర్ : శ్రీకాకుళంజిల్లా కలెక్టర్, సుదర్శన్‌రెడ్డి : కర్నూల్ జిల్లా కలెక్టర్, కె. రాంగోపాల్ : పంచాయతీరాజ్ కమిషనర్, అజయ్‌జైన్ : సాంకేతిక విద్యా శాఖ, ప్రదీప్ చంద్ర : పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, సంజయ్ కుమార్ : ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్, విజయ్‌కుమార్ : ఐజీ స్టాంప్స్, రిజిస్ట్రేషన్, సవ్య సాచి ఘోష్ : ఫుడ్ ప్రొసెసింగ్, చిరంజీవి చౌదరి : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, సురేష్ కుమార్ : గుంటూరు జిల్లా కలెక్టర్, దినకర్‌బాబు: మెదక్ జిల్లా కలెక్టర్.